Apple Lays Off : ఆపిల్‌లో భారీగా ఉద్యోగాల కోత.. ఆ కారణంతో 600 మందిని ఇంటికి పంపేసింది!

ఆపిల్ ఇంక్ సంస్థ తన కారు, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే ప్రాజెక్ట్‌లను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాలిఫోర్నియాలో 600 మందికిపైగా ఆపిల్ ఉద్యోగులను తొలగించింది.

Apple Lays Off : ఆపిల్‌లో భారీగా ఉద్యోగాల కోత.. ఆ కారణంతో 600 మందిని ఇంటికి పంపేసింది!

Apple Lays Off 600 Workers After Halting Car, Smartwatch Projects

Apple Lays Off : ఆపిల్ భారీగా ఉద్యోగాల్లో కోత విధించింది. దాదాపు 600 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించింది. కాలిఫోర్నియా ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌ దాఖలు చేసిన వివరాల ప్రకారం.. ఆపిల్ ఇంక్ సంస్థ తన కారు, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే ప్రాజెక్ట్‌లను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాలిఫోర్నియాలో 600 మందికిపైగా ఆపిల్ ఉద్యోగులను తొలగించింది. కుపెర్టినో, కాలిఫోర్నియాకు చెందిన సంస్థ వర్కర్ అడ్జస్ట్‌మెంట్, రీట్రైనింగ్ నోటిఫికేషన్ లేదా వార్న్ ప్రోగ్రామ్‌కు అనుగుణంగా రాష్ట్రానికి 8 వేర్వేరు నివేదికలను దాఖలు చేసింది.

Read Also : Reliance Digital Sale : రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డే సేల్.. ఐఫోన్ల నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్లు!

ప్రతి కాలిఫోర్నియా కంపెనీలు తప్పనిసరిగా స్టేట్ ఏజెన్సీకి ఒక నివేదికను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి వివరాలను పేర్కొంది. కనీసం 87 మంది ఉద్యోగులు ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ స్క్రీన్ డెవలప్‌మెంట్ పనిచేశారు. మిగతా వారిలో కార్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు.

గత ఫిబ్రవరి చివరిలో ఆపిల్ సంస్థ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు రెండు ప్రాజెక్టులను నిలిపివేయాలని నిర్ణయించింది. అందులో కార్ ప్రాజెక్ట్‌కు సంబంధించి వ్యయ ఆందోళనలు, కార్యనిర్వాహకుల మధ్య అనిశ్చితి కారణంగా రద్దు అయింది. ఇంజనీరింగ్, సరఫరాదారు, వ్యయ సవాళ్ల కారణంగా డిస్‌ప్లే ప్రొగ్రామ్ నిలిపివేసింది.

ఆపిల్ కార్ల ప్రాజెక్టులో 371 మందిపై వేటు :
నివేదికల ప్రకారం.. శాంటా క్లారా, కాలిఫోర్నియాలోని ఆపిల్ ప్రధాన కార్-సంబంధిత ఆఫీసుల్లో మొత్తం 371 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే మల్టీ శాటిలైట్ ఆఫీసుల్లో డజన్ల కొద్దీ ఉద్యోగులపై కూడా ప్రభావం పడింది. కొన్ని సందర్భాల్లో, ఆపిల్ కార్ గ్రూప్ సభ్యులు కృత్రిమ మేధస్సు లేదా పర్సనల్ రోబోటిక్స్‌పై పనిచేయడం వంటి ఇతర బృందాలకు మార్చేసింది.

ఉద్యోగాల కోత వల్ల ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్యపై వ్యాఖ్యానించడానికి ఆపిల్ ప్రతినిధి నిరాకరించారు. ఉద్యోగాల తొలగింపులపై పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఎందుకంటే.. అరిజోనాతో సహా ఇతర ప్రాంతాల్లోని రెండు ప్రాజెక్ట్‌లలో ఆపిల్ అనేక మంది ఇంజనీర్లను కలిగి ఉంది.

Read Also : Taiwan Tallest Skyscraper : తైవాన్‌లో భారీ భూకంపం.. చెక్కుచెదరని 101 అంతస్తుల భవనం.. ఈ స్టీల్ బాల్ ఎలా రక్షించిందంటే?