Taiwan Tallest Skyscraper : తైవాన్‌లో భారీ భూకంపం.. చెక్కుచెదరని 101 అంతస్తుల భవనం.. ఈ స్టీల్ బాల్ ఎలా రక్షించిందంటే?

Taiwan Tallest Skyscraper : తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనంలో ఏర్పాటు చేసిన 660 మెట్రిక్ టన్నుల భారీ ఉక్కు గోళం.. భూకంపాలు, బలమైన గాలుల నుంచి రక్షించే ప్రత్యేకమైన యంత్రాంగాన్ని కలిగి ఉంది.

Taiwan Tallest Skyscraper : తైవాన్‌లో భారీ భూకంపం.. చెక్కుచెదరని 101 అంతస్తుల భవనం.. ఈ స్టీల్ బాల్ ఎలా రక్షించిందంటే?

How A Steel Ball Shielded Taiwan's Tallest Skyscraper During Earthquake

Taiwan Tallest Skyscraper : తైవాన్‌లో అతిపెద్ద భూకంపం విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదు కాగా.. ఈ భూకంపం ధాటికి అక్కడి దేశంలోని పలు నగరాల భారీ భవనాలు కుప్పకూలిపోయాయి. కానీ, రాజధాని తైపీలోని ఒక ఎత్తైన 101 అంతస్తుల భవనం (ఆకాశహర్మ్యం) మాత్రం కొంచెం కూడా చెక్కుచెదరలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనా భవనాల్లో ఇదొకటి కూడా. అయితే, భారీ భూకంపానికి ఈ భారీ భవనం తట్టుకుని నిలబడింది. అతికొద్ది నష్టంతో బయటపడింది.

Read Also : Lachhman Das Mittal : ఎల్‌ఐసీ మాజీ ఏజెంట్.. భారత అత్యంత వృద్ధ బిలియనీర్‌గా లక్ష్మణ్ దాస్ మిట్టల్..!

సీఎన్ఎన్ ప్రకారం.. ఈ భవనంలో అతి పెద్ద గోళం కలిగి ఉండటం కారణంగానే భారీ భూకంపాన్ని తట్టుకుని నిలబడింది. ఈ ఎత్తైనా భవనం మధ్యలో భారీ పసుపు వర్ణపు గోళం ఉండటం చేత భూకంప తరంగాలను తట్టుకుని నిలబడటంలో సాయపడిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ భవనం నిర్మాణం చాలా వినూత్నమైందని, అందుకే అంతటి భూకంపం వచ్చినా ప్రమాదం జరగలేదని అంటున్నారు.

660 మెట్రిక్ టన్నుల బరువు.. 41 స్టీల్ లేయర్లతో నిర్మాణం..
ట్యూన్డ్ మాస్ డ్యాంపర్ ‘డాంపర్ బేబీ’ అనే పేరుతో పిలిచే ఈ భారీ ఉక్కు గోళం 660-మెట్రిక్-టన్నుల బరువు ఉంటుంది. ఈ ఉక్కు గోళాన్ని భవనం మధ్యలో భూమి నుంచి 1,000 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. భూకంపం లేదా బలమైన గాలుల సమయంలో భవనం దెబ్బతినకుండా ఉండేలా గోళం ఊగుతుంది. వార్తా అవుట్‌లెట్ ప్రకారం.. భూకంపం వచ్చినప్పుడు లేదా బలమైన గాలులు వీచినప్పుడు ఈ ఉక్కు గోళం ఎతైనా భవనాన్ని ఊగకుండా 40శాతం వరకు తగ్గిస్తుంది.

41 స్టీల్ లేయర్లతో నిర్మించిన ఈ గోళాన్ని 87వ నుంచి 92వ అంతస్తుల మధ్య వేలాడుతూ ఉండేలా ఏర్పాటు చేశారు. దాదాపు 18 అడుగుల వ్యాసం ఉంటుంది. భవనం కదలికను నిరోధించడానికి 59 అంగుళాల పరిమితిలో స్వింగ్ అవుతుంది. తైపీలోని 101 అంతస్తుల భవనం.. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. తైవాన్‌లో ఇదో ఆకాశహర్మ్యం. భూకంపం సంభవించే ప్రాంతాలలో నిర్మాణాలను రక్షించడానికి వినూత్న ఇంజనీరింగ్‌ను ఉపయోగించి ఈ భవనం రూపకల్పన చేశారు.

How A Steel Ball Shielded Taiwan's Tallest Skyscraper During Earthquake

Taiwan’s Tallest Skyscraper

విండ్-డంపింగ్ బాల్ అంటే ఏంటి? :
విండ్ డంపింగ్ బాల్ సాంకేతిక నామం.. ట్యూన్డ్ మాస్ డంపర్ (TMD)గా పిలుస్తారు. ఈ టీఎండీ అనేది భవనం అవసరాలకు అనుగుణంగా రూపొందించిన నిష్క్రియ వ్యవస్థ. బలమైన గాలుల వల్ల భవనం ఊగిసలాటను తగ్గించడంలో సాయపడుతుంది. పొడవైన టవర్‌ కుప్పకూలిపోకుండా అడ్డుకుంటుంది. అయితే, ఇందులోని సాంప్రదాయక డంపింగ్ సిస్టమ్‌లు బయటకు కనిపించవు. కానీ, తైపీ 101 అంతస్తుల భవనంలో టీఎండీ చాలా క్రియాత్మకమైనది. పసుపు వర్ణంలో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సందర్శకులు గోళం కదలికతో పాటు డంపింగ్ సిస్టమ్ మొత్తం ఆపరేషన్ వీక్షించవచ్చు.

ట్యూన్డ్ మాస్ డంపర్ ఎలా పని చేస్తుంది? :
తైపీ 101 వెబ్‌సైట్ ప్రకారం.. తైపీ 101 అంతస్తు భవనంలో అమర్చిన గోళాకార డంపర్ భూకంపాలు లేదా టైఫూన్‌ల సమయంలో ముందుకు వెనుకకు కదులుతుంది. తైపీ 101 వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లుగా ఈ కదలిక ఏదైనా తీవ్రమైన స్వింగ్ శక్తిని గ్రహిస్తుంది.

డంపర్ ఇంజనీర్లు భవనం కదలికను 40 శాతం వరకు తగ్గించగలదని, తద్వారా లోపల ఉన్నవారికి కదిలిన అనుభవం వంటి అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. భూకంపం సమయంలో తైపీ స్కైలైన్‌ను సంగ్రహించే క్లోజ్డ్-సర్క్యూట్ టీవీ ఫుటేజ్ పగోడా ఆకారపు ఆకాశహర్మ్యం తేలికపాటి కదలికను సూచిస్తుంది. మరో భవనంపై ఉంచిన సెక్యూరిటీ కెమెరాలో భవనం వణుకుతున్నట్లు చూడవచ్చు.

Read Also : Reliance Digital Sale : రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డే సేల్.. ఐఫోన్ల నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్లు!