Apple AirPods
Apple AirPods : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మన హైదరాబాద్‌లోనే టెక్ దిగ్గజం ఆపిల్ ఎయిర్‌పాడ్స్ తయారు చేయనుంది. వచ్చే ఏప్రిల్ నుంచి హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఎగుమతుల కోసం ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తిని ప్రారంభించాలని ఆపిల్ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే భారత్‌లో ఐఫోన్లను తయారు చేస్తున్న ఆపిల్ కంపెనీ రెండో ప్రొడక్టు ఎయిర్‌పాడ్స్ కూడా తయారు చేయనుంది. “భారత మార్కెట్లో ఫాక్స్‌కాన్ హైదరాబాద్ ప్లాంటులో ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. కానీ, ప్రస్తుతానికి ఎగుమతులకు మాత్రమే” అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 2023లో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఫాక్స్‌కాన్ 400 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు రూ.3,500 కోట్లు నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా TWS (రియల్ వైర్‌లెస్ డివైజ్) విభాగంలో ఆపిల్ అగ్రగామిగా నిలిచింది. కెనాలిస్ ప్రకారం.. 2024లో కంపెనీ 23.1 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
కంపెనీ సమీప పోటీదారు శాంసంగ్ కన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువ. పరిశోధనా సంస్థ అంచనా ప్రకారం.. దాదాపు 8.5 శాతంగా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన తర్వాత అమెరికాలో ఆపిల్ తయారీ యూనిట్లలో రాబోయే 4 ఏళ్లలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది.
Read Also : Summer Effect : బాబోయ్.. తాట తీస్తున్న ఎండలు.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త.. బయటకు అసలు రావొద్దు..!
ఈ నేపథ్యంలో ఆపిల్ దేశంలో ఉత్పత్తిని తగ్గించవచ్చనే ఊహాగానాల మధ్య భారత్‌లో ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ డేటా ప్రకారం.. భారత్ హియరబుల్స్, వేరబుల్స్ వస్తువులపై 20 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తుంది. అయితే అమెరికాలో ఎలాంటి టారిఫ్ విధించడం లేదు. ట్రంప్ పరస్పర టారిఫ్ విధిస్తే మాత్రం.. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఎయిర్‌పాడ్స్‌పై 20 శాతం టారిఫ్ పడనుంది.