Summer Effect : బాబోయ్.. తాట తీస్తున్న ఎండలు.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త.. బయటకు అసలు రావొద్దు..!

Summer Effect : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు.

Summer Effect : బాబోయ్.. తాట తీస్తున్న ఎండలు.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త.. బయటకు అసలు రావొద్దు..!

Summer Effect

Updated On : March 17, 2025 / 10:30 AM IST

Summer Effect : ఎండలే ఎండలు.. భగ్గుమంటున్నాయి. బయటకు కాలు పెట్టే పరిస్థితి లేదు. ఉదయం నుంచే ఎండల తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నాం సమయానికి తీవ్రమైన వేడిగాలులు తాట తీసేస్తున్నాయి.

ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు అత్యంత వేగంగా పెరిగిపోతున్నాయి. తీవ్ర వేడిగాలల కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణం కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.

Read Also : Buying AC Home : కొత్త AC కొంటున్నారా? మీ ఇంటికి ఏసీని తెచ్చే ముందు ఈ 5 ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోండి!

వచ్చే మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉత్తర తెలంగాణలో పలు ప్రాంతాల్లో వడగాలులు తీవ్రంగా వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

గత 24 గంటల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 40.3 డిగ్రీ సెల్సి‌యస్ నమోదు కాగా, మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 19.2 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఆదిలాబాద్‌లో సాధారణం కన్నా 3.4 డిగ్రీ సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

అలాగే, హైదరాబాద్, భద్రాచలం, ఖమ్మం, మహబూబ్ నగర్‌లో 3 డిగ్రీల చొప్పున అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చాలావరకు ప్రాంతాల్లో 1 డిగ్రీ నుంచి 3 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరించింది.

ఎండల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తోంది. గత ఏడాది కన్నా ఈ ఏడాదిలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో మాత్రం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

ఏపీలో కూడా ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తోంది. చాలావరకు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. వడగాలులు వేగంగా వీస్తున్నాయి. ఈ వడగాలుల ప్రభావంతో రాష్ట్ర ప్రజలు వేడి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు.

Read Also : Oppo F29 Series Launch : కొత్త ఫోన్ కావాలా? ఒప్పో F29 సిరీస్ వచ్చేస్తోంది.. ఖతర్నాక్ ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

కోస్తా ప్రాంతంలో 45 మండలాల్లో వడగాలలు ఎక్కువగా ఉన్నాయి. 34 మండలాల్లో తీవ్రంగా వేడిగాలులు, 171 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ రెండు మూడు రోజులు ప్రజలు చాలా అప్రమత్తంగా వుండాలని, అవసరమైతే బయటకు రావాల్సిందిగా వాతావరణశాఖ హెచ్చరించింది.