Apple website down for some users, others unable to view images
Apple Website Down : ప్రపంచ ఐటీ దిగ్గజం (Apple) అధికారిక వెబ్‌సైట్ సాంకేతికపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ సహా ఇతర దేశాలపై కూడా ఇదే సమస్య ఎదురైంది. చాలామంది ఆపిల్ యూజర్లకు వెబ్‌సైట్ ఇప్పటికీ లోడ్ అవుతుందని కంప్లయింట్ చేస్తున్నారు. ఆపిల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన యూజర్లకు కొన్ని ఫొటోలు ఇంకా లోడ్ అవుతూనే ఉన్నాయని ఫిర్యాదు చేశారు. కొంతమంది యూజర్లకు కేవలం ‘403 Forbidden Errors’ అని మెసేజ్ కనిపించింది.
అయితే సాధారణంగా Apple తమ ప్రొడక్టులను లాంచ్ చేసే ముందు వెబ్‌సైట్‌ను యూజర్లకు యాక్సెస్ లేకుండా చేస్తుంది. ఆపిల్ ఇప్పుడే కొత్త ఐఫోన్ 14 (iPhone 14 Series), యాపిల్ వాచ్ (Apple Watch Series 8), Airpods Pro 2లను లాంచ్ చేసింది. అయితే ఈ వెబ్‌సైట్ కొన్ని బగ్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి, ఆపిల్ తన సైట్‌లో ఎర్రర్‌కు కారణమేమిటో ఇంకా వెల్లడించలేదు. iPhone 14 ప్రీ-ఆర్డర్ (iPhone 14 Pre-Ordrs)లు లాంచ్ అయిన వెంటనే Apple స్టోర్ సర్వర్‌లు (Apple Store Servers) కొన్ని లొకేషన్‌లలో డౌన్ అయ్యాయి. దాదాపు వారం తర్వాత ఇదే సమస్య ఎదురైంది. ఆ సమయంలో కస్టమర్‌లు Check-Out లేదా ట్రేడ్-ఇన్ Trade-In ప్రక్రియను పూర్తి చేయలేరు. కొత్త ఐఫోన్ 14 వేరియంట్‌లను Pre-Booking చేయడానికి ప్లాన్ చేస్తున్న కొంతమంది కస్టమర్‌లకు ఇబ్బందులు తలెత్తవచ్చు.
Apple website down for some users, others unable to view images
ఆపిల్ iPhone 14, 14 Pro, 14 Pro Max రేపు సెప్టెంబర్ 16న అమ్మకానికి రానున్నాయి. మరోవైపు, iPhone 14 Plus, iPhone Mini మోడల్ ఫోన్లు వచ్చే నెలలో సేల్‌కు అందుబాటులోకి రానున్నాయి. మీరు భారత్ మార్కెట్లో పాత ఐఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అమెజాన్ (Amazon) వంటి ఈ-కామర్స్ సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి, ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు కూడా ప్రస్తుత రిటైల్ ధరను తగ్గించి కొన్ని డీల్స్ అందిస్తున్నాయి.
Apple ఇటీవల రూ. 10వేల ధర తగ్గింపుతో iPhone 13 రూ. 69,900 వద్ద సేల్ ప్రారంభించింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు EMI యేతర లావాదేవీలపై రూ. 2వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ కార్డ్ యూజర్లకు 5 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. అమెజాన్ కూడా అత్యుత్తమ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ 128GB (White) మోడల్ రూ. 65,900కి అందుబాటులో ఉంది. రూ. 13,500 వరకు తగ్గింపు పొందే యూజర్లు అమెజాన్‌లో పాత ఐఫోన్‌లపై కూడా డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : Best 5G Phones 2022 : రూ. 25వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనుక్కోవచ్చు!