Black Cars : బ్లాక్ కారు కొంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయా? అసలు రీజన్ తెలిస్తే షాక్ అవుతారు. ఏ కలర్ కార్లు సేఫ్?
Black Cars : నలుపు రంగు కలర్ కొనొచ్చా? ఈ కలర్ కార్లు తీసుకున్నవారికి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయా? ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? అసలు కారణాలు తెలిస్తే నిజంగా షాకవుతారు.
Black Cars
- కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా?
- బ్లాక్ కలర్ కొంటే తరచుగా ప్రమాదాలు జరుగుతాయా?
- ఏయే కలర్ కార్లు తీసుకుంటే బెటర్? సేఫ్టీ ఎందులో?
- దూరం నుంచి నల్లటి రంగు కార్లను సరిగా చూడలేరు
Black Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీ ఫేవరెట్ కారు కలర్ ఇదేనా? కొత్త కారు కొంటే ఈ రంగు కారు కొనకూడదా? ఇలా ఉంటే దురదృష్టమా? కారు రంగు నల్లగా ఉంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయా? చాలామందికి కలర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ బ్లాక్ (నలుపు) కలర్ అంటే దురదృష్టానికి గుర్తుగా భావిస్తుంటారు.
మరికొంతమంది ఈ బ్లాక్ కలర్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. అయితే, వాహనాల (Black Cars) విషయానికి వస్తే.. బ్లాక్ అండ్ రెడ్ వైట్ మిక్స్ ఎక్కువగా తీసుకుంటారు. అన్నింటిలో బ్లాక్ కలర్ వాహనం తీసుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువట.. దీని వెనుక అసలు కారణాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మీరు ఒకవేళ బ్లాక్ కలర్ కారు తీసుకుంటే అది రోడ్డుపై వెళ్లే సమయంలో సరిగా గుర్తించలేరు. ముఖ్యంగా రాత్రిపూట, వర్షంలో లేదా పొగమంచులో అంత స్పష్టంగా కనిపించవు. దాంతో ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కారు రంగు తెలుపు లేదా పసుపు, రెడ్ వంటివి ఉంటే దూరం నుంచి కూడా ఈజీగా కనిపిస్తాయి.
ఇతర కలర్ల కన్నా బ్లాక్ కలర్ డేంజర్ :
సాధారణంగా కారు కొనేటప్పుడు చాలా మంది స్టయిల్, ఫీచర్లు, కలర్ ఎక్కువగా చూస్తుంటారు. ఎక్కువ మంది బ్లాక్ కలర్ ఎంచుకుంటారు. ఎందుకంటే బ్లాక్ కారుకు స్టైలిష్, ప్రీమియం లుక్ ఉంటుంది. కానీ, ఇదే బ్లాక్ కలర్ రోడ్లపై ప్రమాదాలకు కారణమవుతుందని అనుకోరు. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఇతర కలర్ కార్లతో పోలిస్తే బ్లాక్ కలర్ కార్లు తక్కువగా కనిపిస్తాయి. దీని కారణంగానే రోడ్లపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
Read Also : Voter Enumeration Form : ఫారం తిరిగి ఇవ్వకపోతే ఏమౌతుంది? ఓటరు ఎప్పుడు సమర్పించాలి? ఏయే పత్రాలు అవసరం?
రోడ్లపై కారు స్పష్టంగా కనిపించేలా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఒక వాహనం దూరం నుంచి కూడా ఈజీగా కనిపించేలా ఉండాలి. అప్పుడే ఇతర వాహనాల డ్రైవర్లు అలర్ట్ అయ్యేందుకు వీలుంటుంది. సేఫ్టీ సైడ్ నుంచి చూస్తే కారు కలర్ కూడా ప్రమాదాలను డిసైడ్ చేస్తుంది.
రాత్రిపూట ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ తగినన్ని నల్ల కారును సరిగా చూడలేరు. ఒక వాహనం ఉందనే విషయం ఆలస్యంగా గమనిస్తే ముందున్న డ్రైవర్‌కు బ్రేక్ వేయడం లేదా సైడ్ మూవ్ అయ్యేందుకు చాలా తక్కువ సమయం ఉంటుంది. అదే ముందుగా వాహనం గమనాన్ని గమనిస్తే అలర్ట్ అవ్వొచ్చు. ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుంది.
ఏయే కలర్ కార్లు సురక్షితం? :
వైట్, ఎల్లో, ఆరెంజ్, గోల్డ్ వంటి కలర్ కార్లు రోడ్లపై స్పష్టంగా కనిపిస్తాయి. అన్ని వాతావరణ పరిస్థితులలో లైటింగ్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అయితే, బ్లాక్, యాష్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఉన్న కార్లు కొన్ని వాతావరణ పరిస్థితులలో ఎదురుగా వచ్చే వాహనాలకు తక్కువగా కనిపించవచ్చు. ఎందుకంటే నలుపు రంగు అనేది రోడ్డు, పొగమంచు లేదా మేఘాల మాదిరిగా ఉంటుంది.
ప్రమాదాలకు కారు కలర్ ఒక్కటే కారణం కాదు.. ఎదురుగా వచ్చే వాహనాలకు సరిగా కనిపించకపోవడమే ప్రమాదాలకు కారణం.. అందుకే కొత్త కారు కొనేటప్పుడు బ్లాక్ కలర్ కాకుండా మరి ఏదైనా కలర్ ఎంచుకుంటే బెటర్..
