ICU లో దేశ ఆర్థిక వ్యవస్థ : మాజీ CEA అరవింద్ ఆందోళన

దేశ ఆర్థిక పరిస్థితిపై.. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కామెంట్ చేశారు.

  • Published By: veegamteam ,Published On : December 14, 2019 / 05:27 AM IST
ICU లో దేశ ఆర్థిక వ్యవస్థ : మాజీ CEA అరవింద్ ఆందోళన

Updated On : December 14, 2019 / 5:27 AM IST

దేశ ఆర్థిక పరిస్థితిపై.. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కామెంట్ చేశారు.

దేశ ఆర్థిక పరిస్థితిపై.. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కామెంట్ చేశారు. ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. ట్విన్ బ్యాలెన్స్ షీట్ సంక్షోభంలో సెకండ్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పారు. హార్వర్డ్ వర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ డ్రాఫ్ట్ వర్కింగ్ పేపర్ లో ఆయన ఈ కామెంట్ చేశారు. టీబీఎస్ సమస్యను సుబ్రమణియన్ ఫ్లాగ్ చేశారు. అరవింద్ సుబ్రమణియన్.. 2014లో మోడీ ప్రభుత్వానికి.. ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకన్నాయి. దేశ ఆర్థిక రంగంలో చర్చకు దారితీశాయి.

భారతదేశం ఇప్పుడు పరిష్కరించని లెగసీ టిబిఎస్ సమస్యతో పాటు తాజా టిబిఎస్ -2 సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని సుబ్రమణియన్ చెప్పారు. ఈ రెండూ ఆర్థిక వ్యవస్థను దిగజారుతున్నాయని వాపోయారు. “అధిక రేట్లు, తక్కువ క్రెడిట్.. ఆర్థిక వ్యవస్థను మందగించడానికి కారణమవుతున్నాయి. తద్వారా కార్పొరేట్ రంగంపైన, ఆర్థిక వ్యవస్థపైన ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఆర్థిక రంగాన్ని మరింత జాగ్రత్తగా ఉండటానికి ప్రేరేపిస్తుంది” అని వివరించారు.

ప్రస్తుత మందగమనం ఆందోళన కలిగించే విధంగా ఉందని అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. ”2019-20 రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 4.5 శాతానికి మందగించింది. వినియోగ వస్తువుల ఉత్పత్తి వృద్ధి వాస్తవంగా ఆగిపోయింది. పెట్టుబడి వస్తువుల ఉత్పత్తి పడిపోతోంది. ఎగుమతులు, దిగుమతులు, ప్రభుత్వ ఆదాయాల సూచికలు ప్రతికూల పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయి. ఈ సూచికలు ఆర్థిక వ్యవస్థ దుస్థితిని సూచిస్తున్నాయి. 1991లో తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి దగ్గరగా ఉంది” అని అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు.