Manohari Gold Tea : రికార్డ్‌ ధరకు అసోం మనోహరి టీ పొడి.. కిలో ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్.. అన్నట్టుగా చాలామంది టీ తాగనదే ఆ రోజు మొదలు కాదు. భారతీయులకు టీపై ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Manohari Gold Tea : ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్.. అన్నట్టుగా చాలామంది టీ తాగనదే ఆ రోజు మొదలు కాదు. భారతీయులకు టీపై ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రోజులో ఒకసారైన టీ తాగకుండా ఉండలేరంతే.. ఏ పనిచేసినా ముందు టీ తాగాల్సిందే.. టీ రుచి చూడందే మరో పని మొదలు కాదు.. అంతగా ప్రసిద్ధిచెందిన ఈ టీ గురించి చెప్పగానే అందరికి ముందుగా గుర్తొచ్చిది అసోం.. ఎందుకో తెలుసా? అసలు టీ పొడి ఉత్పత్తి అయ్యేది అసోం రాష్ట్రంలోనే.. అసోంలో ఉత్పత్తి అయ్యే టీ పొడికి కూడా ఫుల్ డిమాండ్ కూడా..  ప్రతి ఏడాది పలు కంపెనీలు అరుదైన కొన్ని టీ పొడులను వేలానికి ఉంచుతుంటాయి. ఆ వేలంలో ఖరీదుకు మించి రికార్డు స్థాయిలో విక్రయించడం జరుగుతుంది. ఇప్పుడు.. మనోహరి గోల్డ్ టీ (Manohari Gold Tea) అని పిలిచే ప్రసిద్ధ అరుదైన అసోం టీని మంగళవారం రికార్డు స్థాయిలో కిలో రూ.99,999 ధరకు వేలంలో అమ్ముడైంది.

మరోలా చెప్పాలంటే.. మనోహరి గోల్డ్ టీ తన రికార్డును తానే బ్రేక్ చేసి.. మరో చరిత్ర సృష్టించింది. గోల్డ్ టీని సౌరవ్ టీ ట్రేడర్స్ (Saurav Tea Traders) అత్యధికంగా కిలోకు రూ.99,999 ధరతో కొనుగోలు చేసింది. మనోహరి గోల్డ్ టీని ఎగువ అసోంలోని దిబ్రూఘర్ జిల్లాలోని మనోహరి టీ ఎస్టేట్ ఉత్పత్తి చేస్తుంది. బహిరంగ వేలంలో ఈ టీకి చెల్లించిన అత్యధిక ధర ఇదేనట.. అంతకుముందు రోసెల్ టీ ఇండస్ట్రీస్‌కు చెందిన డికోమ్ టీ ఎస్టేట్‌లోని గోల్డెన్ బటర్‌ఫ్లై టీగా పిలిచే అరుదైన రకాన్ని కూడా వేలం వేశారు. అసోం టీ గౌహతి టీ వేలం కేంద్రం (GATC)లో ఆ టీ పోడి కిలోకు రూ.75,000 పలికింది. గౌహతి టీ వేలం కేంద్రంలో మంగళవారం మనోహరి గోల్డ్ టీ కిలో రూ.99,999 పలికి మరోసారి చరిత్ర సృష్టించిందని గౌహతి టీ వేలం కొనుగోలుదారుల సంఘం (GATC) కార్యదర్శి దినేష్ బిహానీ తెలిపారు.

ఇదే ప్రపంచ రికార్డు.. అసోం టీ పొడి మరో చరిత్ర :
‘టీ వేలంలో ఇది ప్రపంచ రికార్డు. మనోహరి గోల్డెన్ టిప్స్ టీ కిలో రూ.99,999కి విక్రయించబడడం గర్వకారణం. ఈ టీ ఎంతో ప్రత్యేకమైనది.. అరుదైనది కూడా. దీనిని డిబ్రూఘర్ జిల్లాలోని మనోహరి టీ ఎస్టేట్ ఉత్పత్తి చేస్తుంది. అసోంలోని తేయాకు పరిశ్రమ రాబోయే భవిష్యత్తులో కూడా ఈ రకమైన ప్రత్యేకమైన టీ, వైట్ టీ, ఊలాంగ్ టీ, గ్రీన్ టీ, పసుపు టీలను ఉత్పత్తి చేస్తుందని ఆశిస్తున్నాను. సౌరభ్ టీ ట్రేడర్స్‌కు చెందిన స్థానిక కొనుగోలుదారు మంగీలాల్ మహేశ్వరి ఈ టీ పొడిని కొనుగోలు చేశారు’ అని దినేష్ బిహానీ తెలిపారు. మనోహరి గోల్డ్ టీ.. ఇప్పుడు గౌహతి టీ వేలం కేంద్రం టీ లాంజ్ ప్రాంగణంలో అందుబాటులో ఉందని తెలిపారు. అంతకుముందు ఆగస్టు 2019లో డికోమ్ టీ ఎస్టేట్‌లోని గోల్డెన్ బటర్‌ఫ్లై టీని GTAC బ్రోకర్ ద్వారా గౌహతి టీ వేలం కేంద్రం (GTAC) సేల్ నంబర్ 33లో GTAC బ్రోకర్ ద్వారా రూ. 75,000కి విక్రయించారు. ఈ టీ పొడిని పురాతన టీ దుకాణాల్లో ఒకటి కొనుగోలు చేసింది. ఆగస్ట్ 1, 2019న, గౌహతికి చెందిన ముంధ్రా టీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మైజాన్ టీ గార్డెన్ నుంచి ఆర్థడాక్స్ గోల్డెన్ టిప్స్ టీని కిలోకు రూ. 70,501 రికార్డు ధరతో కొనుగోలు చేసింది.

ఉత్తర భారతదేశంలో రెండవ అతిపెద్ద టీ వేలాని నిర్వహించే బ్రోకర్ పార్కాన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఈ వేలాన్ని నిర్వహించింది. 2019 జూలై 30న, అసోంలోని దిబ్రూఘర్ జిల్లాలో మనోహరి టీ ఎస్టేట్ తయారు చేసిన మనోహరి గోల్డ్ గౌహతి టీ వేలం కేంద్రంలో కిలోకు రూ. 50,000 పలికింది. గౌహతిలోని సౌరభ్ టీ ట్రేడర్స్ కొనుగోలు చేసింది. 200 ఏళ్లుగా ఈ తేయాకు పరిశ్రమ అభివృద్ధి చెందుతూనే ఉంది. అసోం టీ ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందింది. అసోం ప్రపంచంలోనే అతిపెద్ద టీ-పెరుగుతున్న ప్రాంతాలలో ఒకటిగా చెప్పవచ్చు. నివేదికల ప్రకారం.. 2016-17లో గౌహతి టీ వేలం కేంద్రంలో దాదాపు 17.41 కోట్ల కిలోల టీ అమ్ముడైంది. 2017-18లో 18.44 కోట్ల కిలోలకు పెరగగా.. 2018-19లో 18.29 కోట్ల కిలోలకు పెరిగింది. అలాగే 2019-20లో రూ. 16.22 కోట్ల కిలోలకు పెరిగింది. గౌహతి టీ వేలం కేంద్రం కింద మొత్తం 1241 తేయాకు తోటలు, 244 మంది కొనుగోలుదారులు రిజిస్టర్ చేసుకున్నారు.

Read Also : Google Chrome Update : భారతీయ గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక.. ఎందుకో తెలుసా?!

ట్రెండింగ్ వార్తలు