Google Chrome Update : భారతీయ గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక.. ఎందుకో తెలుసా?!

మీ పర్సనల్ కంప్యూటర్, మొబైల్ ఫోన్లలో గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. భారత్‌లోని గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.

Google Chrome Update : భారతీయ గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక.. ఎందుకో తెలుసా?!

Update Google Chrome Now As Government Advises Caution. Know Why And How To Do It

Google Chrome Update : మీ పర్సనల్ కంప్యూటర్, మొబైల్ ఫోన్లలో గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. భారత్‌లోని గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), గూగుల్ క్రోమ్ యూజర్లకు ‘high severity’ హెచ్చరికను జారీ చేసింది. దేశంలో అత్యధికంగా ఉపయోగించే బ్రౌజర్ లలో గూగుల్ క్రోమ్ ఒకటి.. వ్యక్తిగత కంప్యూటర్‌లు మొబైల్ ఫోన్‌లలో ఈ క్రోమ్ బ్రౌజర్ వినియోగించే యూజర్లు అధికంగా ఉంటారు.

అందుకే క్రోమ్ యూజర్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారు. క్రోమ్ యూజర్ల సిస్టమ్‌లో ఆర్బిటరీ కోడ్‌ (arbitrary code)ను ఎగ్జిక్యూట్ చేయడానికి సైబర్ నేరగాళ్లు Google Chrome వినియోగించే ముప్పు ఉందని CERT-In ఒక ప్రకటనలో పేర్కొంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో వివిధ (vulnerabilities) భద్రతాపరమైన లోపాలను ప్రభుత్వం నిశితంగా గమనించింది. క్రోమ్ బ్రౌజర్ సెక్యూరిటీ లోపం కారణంగా.. సైబర్ నేరగాళ్లు సులభంగా యూజర్ల వ్యక్తిగత సమాచారానికి యాక్సెస్‌ చేసే ముప్పు ఉందని తెలిపింది. అంతేకాదు.. క్రోమ్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని వారి కంప్యూటర్లలో డేటాను తస్కరించేందుకు మాల్వేర్‌ను చొరబడేందుకు అనుమతిస్తుందని గుర్తించినట్టు CERT-In వెల్లడించింది.

Read Also : Netflix vs Amazon Prime Video New Plans : అమెజాన్ ప్రైమ్ ధరలు పెంచుతుంటే.. నెట్ ఫ్లిక్స్ మాత్రం ధరలు తగ్గిస్తోంది..!

గూగుల్ క్రోమ్ V8లో టైప్ కన్‌ఫ్యూజన్ కారణంగానే అనేక భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు తెలిపారు. టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పటికే Chrome కు సంబంధించి బగ్స్ ఫిక్స్ చేస్తూ లేటెస్ట్ అప్‌డేట్‌ రిలీజ్ చేసింది. గూగుల్ క్రోమ్ వెర్షన్ V8లో లోపాలను సవరించేందుకు గూగుల్ కూడా సొలుష్యన్ అప్‌డేట్ రిలీజ్ చేసింది. క్రోమ్ వాడే యూజర్లంతా తమ బ్రౌజర్‌ను తక్షణమే అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. Google Chrome లేటెస్ట్ వెర్షన్‌ను అప్‌డేట్ చేయడంలో విఫలమైతే, ఆన్‌లైన్ సైబర్ దాడికి పాల్పడే హ్యాకర్లు మీ కంప్యూటర్‌ను రిమోట్‌గా హ్యాక్ చేసే అవకాశం అధికంగా ఉందని హెచ్చరించింది. మీ సున్నితమైన, వ్యక్తిగత డేటా లీక్ కాకుండా ఉండేందుకు వెంటనే క్రోమ్ అప్ డేట్ చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సూచించారు. యూజర్ల ప్రైవసీని నిర్ధారించడానికి Chrome New Update కొత్త అప్‌డేట్‌లో పరిశోధకులు సూచించిన 22 రకాల సెక్యూరిటీ ఫిక్సెస్ పొందుపరిచినట్లు Google పేర్కొంది.

Google Chrome Latest Version వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలని ప్రభుత్వ సలహాదారుతో పాటు గూగుల్ కూడా సూచించింది. ఇటీవలే గూగుల్ క్రోమ్ స్టేబుల్ ఛానెల్‌ని Windows, Mac, Linux యూజర్ల కోసం 96.0.4664.93 Version అప్‌డేట్ చేసింది. ఈ కొత్త అప్ డేట్.. గూగుల్ క్రోమ్ యూజర్ల అందరికి అందుబాటులో ఉంది. Google Chrome లేటెస్ట్ వెర్షన్‌ వెంటనే అప్ డేట్ చేసుకోండి.. క్రోమ్ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసా? Chrome బ్రౌజర్ అప్ డేట్ కోసం చెక్ చేయండిలా.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కుడి పైభాగంలో 3 వర్టికల్ డాట్స్ కనిపిస్తాయి. ఆ డాట్స్ పై క్లిక్ చేయండి.. అప్పుడు మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. కిందిభాగంలో Help అనే బటన్ పై క్లిక్ చేయండి. About Google Chrome ఆప్షన్ క్లిక్ చేయండి. అంతే క్రోమ్ దానంతట అదే కొత్త వెర్షన్ కు అప్ డేట్ అయిపోతుంది. క్రోమ్ బ్రౌజర్ అప్ డేట్ పూర్తి అయిన తర్వాత మీ సిస్టమ్‌ను ఒకసారి రీస్టార్ట్ లేదా రీబూట్ చేయండి. మీ అకౌంట్ల వివరాలను సెక్యూర్ కోసం అన్ని పాస్ వర్డులను మార్చుకోండి.

Read Also : SBI Card PULSE : SBI ఫిట్‌నెస్ ఫోకస్డ్ క్రెడిట్ కార్డు లాంచ్.. ఎన్ని ఆఫర్లో తెలుసా?