Netflix vs Amazon Prime Video New Plans : అమెజాన్ ప్రైమ్ ధరలు పెంచుతుంటే.. నెట్ ఫ్లిక్స్ మాత్రం ధరలు తగ్గిస్తోంది..!

ఆసియా పసిఫిక్ రీజన్ కీలకంగా స్ట్రీమింగ్ కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ధరలు పెంచితే.. ఓటీటీ యూజర్ బేస్ లక్ష్యంగా నెట్ ఫ్లిక్స్ ధరలను భారీగా తగ్గించింది.

Netflix vs Amazon Prime Video New Plans : అమెజాన్ ప్రైమ్ ధరలు పెంచుతుంటే.. నెట్ ఫ్లిక్స్ మాత్రం ధరలు తగ్గిస్తోంది..!

Netflix Vs Amazon Prime New Plans Netflix Vs Amazon Prime Vs Disney+hotstar Prices, Plans And Other Details

Netfilx vs Amazon Prime New Plans : ఇప్పుడు ట్రెండ్ అంతా ఓటీటీనే (OTT).. ఆన్‌లైన్‌లోనే అన్నీ చూడొచ్చు.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌పై వెబ్ సిరీస్‌ల నుంచి టీవీషోలు, సినిమాలు.. ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలకు వేదికగా మారింది. కరోనా మహమ్మారి పుణ్యామాని ఓటీటీకి ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ప్రతి చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాల వరకు ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ ప్లాట్ ఫాం మరింత పుంజుకుంది. రానురాను ఓటీటీ కంటెంట్ వీక్షించే వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఇప్పటివరకూ తక్కువ ధరకే వీడియో కంటెంట్ అందించిన స్ట్రీమింగ్ సర్వీసు కంపెనీలు ప్రీమియం ఛార్జీలను పెంచడం మొదలుపెట్టాయి. అందులో అమెజాన్ ప్రైమ్ ఒకటి అయితే.. రెండోది డిస్నీ+ హాట్ స్టార్ (Disney+ HotStar).. ఈ రెండు స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలు అమాంతం ధరలు పెంచేశాయి. దీనికి కారణం ఓటీటీలో పోటీనే చెప్పాలి. ఆసియా పసిఫిక్ రీజన్ కీలకంగా స్ట్రీమింగ్ కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయి. అందులో భారతీయ ఓటీటీ వినియోగదారులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాయి.

ఒకవైపు.. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) , డిస్నీ+ హాట్ స్టార్ ( Disney+Hotstar) తమ ప్రీమియం ప్లాన్లను భారీగా పెంచేస్తూ పోతుంటే.. ఇంటర్నేషనల్ పాపులర్ ఆన్ లైన్ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లెక్స్ (Netfilx) మాత్రం తమ నెలవారీ ప్రీమియం ప్లాన్లను భారీగా తగ్గిస్తున్నట్టు బంపర్ ప్రకటించింది. భారతీయ యూజర్లను తమవైపు ఆకర్షించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తోంది నెట్ ఫ్లిక్స్.. యూజర్ బేస్ పెంచుకోవడమే లక్ష్యంగా నెట్ ఫ్లిక్స్ ప్రీమియం ఛార్జీలను అమాంతం తగ్గించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రమే కాదు.. డిస్నీ+ హాట్ స్టార్ ( Disney+Hotstar) తో పాటు జీ ఎంటర్‌టైన్ మెంట్ G5, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్, సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్ ఫాంలు కూడా నెట్ ఫ్లిక్స్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. వీటన్నింటికి భిన్నంగా వీడియో కంటెంట్ అందించి యూజర్లను ఆకట్టుకునేందుకు నెట్ ఫ్లిక్స్ నెలవారీ సబ్ స్ర్కిప్షన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. 2016లో భారత్‌లో తమ సర్వీసులను లాంచ్ చేసిన నెట్ ఫ్లిక్స్ తొలిసారి నెట్ ఫ్లిక్స్ ధరలను భారీగా తగ్గించింది.

Netfilx సబ్ స్ర్కిప్షన్ ధరలు భారీగా తగ్గింపు :
ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ మొబైల్ నెలవారీ సబ్ స్క్రిప్షన్ రూ. 199గా ఉంది. ఇప్పటినుంచి రూ. 149కే ఈ ప్లాన్ అందిస్తోంది. ఇక బేసిక్‌ ప్లాన్‌ ధరను రూ.499 నుంచి రూ.199కి తగ్గించింది. స్టాండర్డ్‌ ప్లాన్‌ రూ.649 నుంచి రూ.499కు, ప్రీమియం ప్లాన్‌కు రూ.799 నుంచి రూ.649కు ఆఫర్ చేస్తోంది నెట్ ఫ్లిక్స్.. ప్రీమియం టైర్ సబ్ స్ర్కిప్షన్ గా పిలిచే ఈ ప్లాన్ పై ఒకేసారి నాలుగు స్ర్కీన్లలో Ultra HD కంటెంట్ చూడొచ్చు. అయితే నెట్ ఫ్లిక్స్ తగ్గించిన కొత్త ధరలు డిసెంబర్ 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్ర్కిప్షన్ ధరలు కూడా ఈ రోజు నుంచే భారీగా పెరగనున్నాయి. నెట్ ఫ్లిక్స్ తమ యూజర్ బేస్ పెంచడానికి ఇదే అనుకూలమైన సమయమని.. అమెజాన్ తగ్గించిన రోజునే నెట్ ఫ్లిక్స్ తమ ధరలను భారీగా తగ్గించింది.

Netfilx సబ్‌స్క్రిప్షన్‌ కొత్త ధరలివే :
– రూ.499గా నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ రూ.199కు తగ్గించింది నెట్‌ఫ్లిక్స్‌.
– ఈ ప్లాన్ పై (స్టాండర్డ్ డెఫినెషన్ (SD)లో టీవీ, మొబైల్‌, ట్యాబ్లెట్, కంప్యూటర్ సింగిల్ డివైజ్.. నెల రోజుల పాటు చూడొచ్చు.
– మంచి క్వాలిటీతో వీడియో కంటెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇండియాలో 60శాతం సబ్‌స్క్రైబర్లు ఇదే ప్లాన్ వాడుతున్నారు.
– 2019లో నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ఓన్లీ ప్లాన్ రూ.199తో తీసుకొచ్చింది. ఇప్పుడు రూ.149కి తగ్గించింది. మొబైల్‌లో నెలరోజుల పాటు HD వీడియో కంటెంట్ చూడొచ్చు.
– సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే చాలు.. రెండు డివైజ్‌ల్లో HD వీడియో కంటెంట్ నెల రోజులు చూసే ప్లాన్ ఇది.. స్టాండర్డ్ ప్లాన్‌ ధర రూ.649 నుంచి రూ.499కు తగ్గించింది నెట్‌ఫ్లిక్స్‌.
– ప్రీమియమ్ ప్లాన్‌.. 4 డివైజ్‌‌ల్లో నెలవారి ప్లాన్‌ ధరను రూ.799 నుంచి రూ.649కి తగ్గించింది నెట్‌ఫ్లిక్స్‌.
– ఈ కొత్త ప్లాన్ ధరలు యూజర్ల వచ్చే బిల్లింగ్ సైకిల్ నుంచి వర్తించనున్నాయి.
– ప్రస్తుతం రూ.499 ప్లాన్‌పై ఉన్న యూజర్లు.. కొత్త స్టాండర్డ్ ప్లాన్‌కు అదే ధరతో మారొచ్చు..
-అప్‌గ్రేడ్ ఆప్షన్ ద్వారా తక్కువ ధర ప్లాన్‌ కావాలంటే ఎంచుకోవచ్చు.. లేదంటే అదే అప్ గ్రేడ్ రిజక్ట్ చేయొచ్చు.

Read Also : Netflix India: భారీగా తగ్గిన నెట్‌ఫ్లిక్స్ ఇండియా రేట్లు

అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్ల కొత్త ధరలు :
2016లో అమెజాన్‌.. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను భారత్‌లో ప్రారంభించింది. అప్పట్లో ఏడాది మెంబర్ షిప్ ప్లాన్ రూ.499గా ఉండేది. ఆ తర్వాత 2019లో రూ.999కు పెంచింది. 2018లో నెలవారీ మెంబర్ షిప్ కూడా అమెజాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే కొత్త ప్లాన్లు తీసుకునే యూజర్లకు సూచనలు చేసింది అమెజాన్ ఇండియా. ప్రస్తుతం ప్రైమ్​ వీడియో యాక్సస్ చేసుకునే యూజర్లు తమ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత కూడా అకౌంట్​లో (Debit​, Credit Cards​)​ సేవ్ అయి ఉంటే.. ఆయా సబ్​స్క్రిప్షన్​ ఆటో రెన్యువల్ (Auto Renewal) కాదని వెల్లడించింది. అమెజాన్ అందించే కొత్త ధరల సబ్​స్క్రిప్షన్ ప్లాన్లు తీసుకోవాలా? లేదా అనేది పూర్తిగా యూజర్లకే వదిలేసింది.

– అమెజాన్ ప్రైమ్ కొత్త ధరలను భారీగా పెంచేసింది..
– గరిష్ఠంగా వార్షిక ప్లాన్‌పై 50శాతం ధరను పెంచింది అమెజాన్.
– ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ రూ.999 నుంచి రూ.1,499కు పెంచింది.
– అమెజాన్ ప్రైమ్ నెలవారీ ప్యాక్ రూ.129 నుంచి రూ.179కు పెంచింది.
– రూ.329తో మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ ధరను రూ.459కు పెంచేసింది.
– అమెజాన్ ప్రైమ్ ఒక సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా ఒకేసారి 3 డివైజ్‌ల్లో యాక్సస్ చేసుకోవచ్చు.

Read Also : Amazon Prime: డిసెంబర్ 13తర్వాత మెంబర్‌షిప్ కోసం భారీగా వసూలు చేయనున్న అమెజాన్