SBI Card PULSE : SBI ఫిట్‌నెస్ ఫోకస్డ్ క్రెడిట్ కార్డు లాంచ్.. ఎన్ని ఆఫర్లో తెలుసా?

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) కొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఈ క్రెడిట్ కార్డును Fitness-Focused Credit Card పేరుతో ఫిట్‌నెస్ ప్రియుల కోసం తీసుకొచ్చింది.

SBI Card PULSE : SBI ఫిట్‌నెస్ ఫోకస్డ్ క్రెడిట్ కార్డు లాంచ్.. ఎన్ని ఆఫర్లో తెలుసా?

Sbi Card Launches Fitness Focused Credit Card That Offers Welcome Gift And Access To Gyms

Updated On : December 14, 2021 / 8:48 PM IST

SBI Card fitness Credit : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) కొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఈ క్రెడిట్ కార్డును Fitness-Focused Credit Card పేరుతో ఫిట్‌నెస్ ప్రియుల కోసం తీసుకొచ్చింది. SBI Card, ఫిట్‌నెస్ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకునేవారే లక్ష్యంగా ఎస్బీఐ ఈ కొత్త క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డు ద్వారా ఫిట్‌నెస్, ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాదు.. మొట్టమొదటి క్రెడిట్ కార్డ్ ‘SBI కార్డ్ పల్స్’ను కూడా ఎస్బీఐ ప్రారంభించింది.

కాంటాక్ట్‌లెస్ కార్డును వార్షిక సభ్యత్వ రుసుము రూ.1,499తో అందిస్తోంది. వీసా సిగ్నేచర్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ ఫిట్ నెస్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. కార్డ్ మెంబర్‌షిప్ రాయితీ కోసం.. ఏడాదిలో రూ.2 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వార్షిక రెన్యువల్ ఫీజు పేమెంట్ పై మినహాయింపు వర్తిస్తుంది. SBI కార్డ్ పల్స్ కస్టమర్‌లకు జాయినింగ్ ఫీజు చెల్లింపుపై Welcome GIft కింద రూ. 4,999 విలువైన నోయిస్ కలర్‌ఫిట్ పల్స్ (Noise ColorFit Pulse) స్మార్ట్‌వాచ్‌ను ఆఫర్ చేస్తోంది.

దేశవ్యాప్తంగా కస్టమర్‌లను లక్ష్యంగా కార్డ్ హోల్డర్‌ల ఆరోగ్యం దృష్టా వారికి వైద్య అవసరాల కోసం ఈ కార్డును రూపొందించినట్టు తెలిపింది. ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు, ప్రయోజనాలతో కార్డ్ ఆలోచనాత్మకంగా రూపొందించామని కంపెనీ వెల్లడించింది. నాయిస్ కలర్ ఫిట్ పల్స్ స్మార్ట్‌వాచ్ 1.4 అంగుళాల ఫుల్ కలర్ డిస్‌ప్లే, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ (SPO2), స్లీప్ మానిటరింగ్ సహా ఎంబెడెడ్ ఫీచర్‌లను కలిగి ఉంది. కాంప్లిమెంటరీ కింద ఏడాది వరకు ఫిట్‌పాస్ ప్రో (Fitpass Pro) మెంబర్‌షిప్ద్వారా SBI కార్డ్ పల్స్ కస్టమర్‌లు భారతదేశం అంతటా 4,000 ప్లస్ జిమ్‌లు, ఫిట్‌నెస్ స్టూడియోల క్యూరేటెడ్ నెట్‌వర్క్‌కు యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే యోగా, డ్యాన్స్, కార్డియో, పైలేట్స్ సహా అన్ లిమిటెడ్ ఆన్‌లైన్ ఫిట్‌నెస్ సెషన్‌లను పొందవచ్చు.

SBI కార్డు PULSE వివరాలివే :
– Welcome Benefit : రుసుము చెల్లింపుపై రూ. 4,999 విలువైన Noise ColorFit PULSE Smartwatch సొంతం చేసుకోవచ్చు.
– జాయినింగ్ & యాక్టివేషన్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
– Fitpass Pro కాంప్లిమెంటరీ ఏడాది వరకు మెంబర్ షిప్ కూడా పొందవచ్చు.
– FITPASS మెంబర్ షిప్ ద్వారా 4,000+ జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లలో క్యూరేటెడ్ నెట్‌వర్క్‌కు యాక్సస్ చేసుకోవచ్చు.
– నెలకు గరిష్టంగా 12 సెషన్‌లలో అనుమతి ఉంటుంది. (వారానికి 3 సెషన్‌లు మాత్రమే.. రోజు 1 సెషన్).
– ఫిట్‌కోచ్, ఫిట్‌ఫీస్ట్ మెంబర్‌షిప్‌లు – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్సెస్ చేసుకోవచ్చు.
– FITPASS మొబైల్‌లో ఫిట్‌నెస్ కోచింగ్ రొటీన్‌లు, పోషకాహార నిపుణులు అందుబాటులో ఉంటారు.

అప్లికేషన్ :
– కాంప్లిమెంటరీ ఒక ఏడాది Netmeds First Membership పొందవచ్చు.. ప్రయోజనాలివే..
– ఒక ఏడాది పాటు అన్‌లిమిటెడ్ ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్ పొందవచ్చు.
– వార్షిక ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు
– ప్రతి ప్రీపెయిడ్ ఆఫర్‌పై అదనంగా 2.5శాతం NMS నగదు (రూ. 100 వరకు)
– పాథాలజీ ల్యాబ్ పరీక్షలపై అదనంగా 5శాతం తగ్గింపు అందిస్తోంది.
– అన్ లిమిటెడ్ ఫ్రీ, డెలివరీ ప్రాధాన్యత కూడా ఉంటుంది.

Read Also : Netflix vs Amazon Prime Video New Plans : అమెజాన్ ప్రైమ్ ధరలు పెంచుతుంటే.. నెట్ ఫ్లిక్స్ మాత్రం ధరలు తగ్గిస్తోంది..!