ASUS Dawn 7S Ryzen Edition : వారెవ్వా.. ఆసుస్ కొత్త AI ల్యాప్‌టాప్ చూశారా? ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర జస్ట్..
ASUS Dawn 7S Ryzen Edition : ఆసుస్ నుంచి సరికొత్త ఏఐ ల్యాప్‌టాప్ వచ్చేసింది. 16GB DDR5 ర్యామ్ ఉంది. 96GB వరకు మెమరీకి సపోర్ట్ చేస్తుంది. పూర్తి ఫీచర్లు, ధర ఎంతో తెలుసుకుందాం..
ASUS Dawn 7S Ryzen Edition
- డిస్ప్లే 2.5K రిజల్యూషన్, 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- 96GB వరకు మెమరీని సపోర్ట్ చేస్తుంది
- 1TB PCIe 4.0 SSD స్టోరేజ్, 70Wh బ్యాటరీ
ASUS Dawn 7S Ryzen Edition : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఆసుస్ నుంచి సరికొత్త ఆసుస్ డాన్ 7S రైజెన్ ఎడిషన్ వచ్చేసింది. ఈ కొత్త సరసమైన ల్యాప్‌టాప్ అద్భుతమైన ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఏఎమ్‌డీ రైజెన్ ఏఐ5 330 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఏఐ టాస్కుల కోసం స్పెషల్ NPUతో వస్తుంది.
ఈ ల్యాప్‌టాప్‌లో 16GB DDR5 ర్యామ్ 1TB PCIE 4.0 SSD స్టోరేజ్ ఉన్నాయి. అలాగే, డిస్ప్లే 2.5K రిజల్యూషన్, 144హెర్ట్జ్ రిఫ్రెష్ (ASUS Dawn 7S Ryzen Edition) రేట్‌తో వస్తుంది. 70డబ్ల్యూహెచ్ బ్యాటరీతో పాటు మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ ధర, ఇతర ముఖ్య ఫీచర్లను వివరంగా పరిశీలిద్దాం..
ఆసుస్ డాన్ 7S రైజెన్ ఎడిషన్ ధర :
ఆసుస్ డాన్ 7ఎస్ రైజెన్ ఎడిషన్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ల్యాప్‌టాప్ ధర 6,999 యువాన్లు (సుమారు రూ. 98,000). JD.com నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఆసుస్ డాన్ 7S రైజెన్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు :
సరసమైన ధరలో ఆసుస్ డాన్ 7S రైజెన్ ఎడిషన్ ల్యాప్‌టాప్ లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లో 16:10 యాస్పెక్ట్ రేషియో, యాంటీ-గ్లేర్ ప్యానెల్‌తో IPS డిస్ప్లే ప్యానెల్ ఉంది. ఈ డిస్ప్లే 2.5K రిజల్యూషన్ 144Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది.
Read Also : PhonePe Wallet : కొత్త రూల్స్.. మీకు ఫోన్‌పే నుంచి ఇలా మెసేజ్ వచ్చిందా? నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మీరే!
రైజెన్ AI 5 330 ప్రాసెసర్‌తో వస్తుంది. ఏఐ టాస్కుల కోసం స్పెషల్ NPU అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 16GB DDR5 ర్యామ్ ఉంది. 96GB వరకు మెమరీకి సపోర్ట్ చేస్తుంది. 1TB PCIe 4.0 SSD స్టోరేజ్‌తో కూడా వస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ 70Wh బ్యాటరీతో రన్ అవుతుంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కోసం USB-C PD పోర్ట్ అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో థండర్‌బోల్ట్ పోర్ట్, USB-A పోర్ట్, HDMI 2.1, ఈథర్నెట్ (RJ45), 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.
ఈ ల్యాప్‌టాప్ బరువు 1.87 కిలోలు. సేఫ్టీ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. కాల్స్ కోసం ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. మన్నిక కోసం MIL-STD 810H సర్టిఫికేషన్ అందిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే Wi-Fi 7 బ్లూటూత్ 5.4కు సపోర్ట్ చేస్తుంది.
