Ather 450X EV Scooter : అత్యంత సరసమైన ధరకే ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లను బట్టి రేటు.. ఇప్పుడే కొనేసుకోండి..!

Ather 450X EV Scooter : ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నుంచి ఈవీ స్కూటర్ 450X కొత్త వేరియంట్ వచ్చేసింది. అత్యంత సరసమైన ధరకే భారత మార్కెట్లో ఇప్పుడు ధర రూ. 98,079 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభ్యమవుతుంది.

Ather 450X now more affordable, Here are all the details you should know

Ather 450X EV Scooter : ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నుంచి ఈవీ స్కూటర్ 450X కొత్త వేరియంట్ వచ్చేసింది. అత్యంత సరసమైన ధరకే భారత మార్కెట్లో ఇప్పుడు ధర రూ. 98,079 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభ్యమవుతుంది. అయితే, ఈ ధరకు ఏథర్ 450x స్కూటర్ (Ather 450X Scooter) సొంతం చేసుకోవాలంటే.. కంపెనీ స్కూటర్‌లోని కొన్ని ఫీచర్లను తొలగిస్తుంది. అందులో ముఖ్యమైన ఫీచర్లను మాత్రమే పొందవచ్చు. ఒకవేళ, కస్టమర్ కోరుకుంటే.. ఏథర్ ప్రో ప్యాక్‌ని ఎంచుకోవచ్చు. ఫీచర్లను బట్టి రేటు పెరగొచ్చు. తద్వారా స్కూటర్ ధర రూ. 30వేల వరకు పెరుగుతుంది.

ఏథర్ 450X బేస్ వేరియంట్ :
ఏథర్ 450X అన్ని వేరియంట్‌లు 6.4kW మోటార్‌తో వస్తాయి. గరిష్ట టార్క్, టాప్ స్పీడ్ ఒకేలా ఉంటాయి. అందుకే, 26Nm టార్క్, 90kmph గరిష్ట వేగాన్ని పొందవచ్చు. అదే.. బేస్ వేరియంట్ తీసుకుంటే.. రైడ్ మోడ్‌లు, పార్క్ అసిస్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండవు. సిమ్ కార్డ్ కనెక్ట్ అయి ఉంటుంది. తద్వారా OTA అప్‌డేట్‌లను కూడా పొందలేరు. ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కూడా మార్పులు చేయాల్సి వస్తుంది.

Ather 450X Scooter now more affordable, Here are all the details you

Read Also : Aadhaar Update Online : మీ ఆధార్ కార్డులో అడ్రస్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీని ఇలా ఈజీగా మార్చుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

ఏథర్ 450X ఛార్జింగ్ సమయం ఎంతంటే? :
ఈ బేస్ వేరియంట్‌లో అతి పెద్ద లోపం ఏంటంటే.. ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలతో రాలేదు. రీఛార్జ్ చేసేందుకు 15 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది. అదే ప్రో ప్యాక్‌ చూస్తే.. 5 గంటల 40 నిమిషాల ఛార్జింగ్ సమయం పడుతుంది. అంటే.. సున్నా నుంచి 80 శాతం ఛార్జింగ్ సమయం కూడా 12 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌లో బేస్ వేరియంట్‌ను ఛార్జ్ చేయడం సాధ్యం కాదని చెప్పవచ్చు.

ఏథర్ 450X బేస్ వేరియంట్ వారంటీ :
బేస్ వేరియంట్‌పై బ్యాటరీ వారంటీ 30వేల కి.మీ లేదా 3 ఏళ్లుగా ఉంటుంది. అదే ప్రో ప్యాక్‌తో 5 ఏళ్లు, 60వేల కి.మీల వారంటీని పొందవచ్చు. వాహన వారంటీ 3 ఏళ్లు లేదా 30వేల కి.మీ వరకు ఏథర్ ఎనర్జీ అందిస్తుంది.

Read Also : Flipkart Summer Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.12,999 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!