Audi E tron GT: ఇండియన్ మార్కెట్‌లో ‘ఆడి’ ఎలక్ట్రిక్ కార్లు.. ధర ఎంతో తెలుసా?

Audi launches its most powerful EV in India

Audi E tron GT: ఇండియన్ మార్కెట్‌లో ‘ఆడి’ ఎలక్ట్రిక్ కార్లు.. ధర ఎంతో తెలుసా?

Audi E Tron

Updated On : September 22, 2021 / 4:47 PM IST

Audi E tron GT: ఇండియన్ మార్కెట్‌లో కార్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలికాలంలో ముఖ్యంగా బ్యాటరీలతో నడిచే వాహనాలకు క్రేజ్.. విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే జర్మన్ ఆటోమొబైల్ కంపెనీ “ఆడి” తన అత్యంత శక్తివంతమైన మరియు లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ఈ-ట్రాన్‌ జిటిని భారతదేశంలో విడుదల చేసింది, ఇది స్పోర్టివ్ లుక్ మరియు అధ్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది.

విపరీతమైన వేగం మరియు బ్యాటరీ రేంజ్‌తో భారతదేశంలో “ఆడి” ఈ-ట్రాన్ జీటీ ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో అందిస్తోంది. ఆడి ఈ-ట్రోన్ జిటి క్వాట్రో మరియు ఆడి ఆర్ఎస్ ఈ-ట్రోన్ జీటీ, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 488 కిలోమీటర్ల వరకు బ్యాటరీ ఉంటుంది. అదే సమయంలో గరిష్ట వేగం 245 కిలో మీటర్లుగా ఉంది. టెస్లాకార్లకు పోటీగా ఈ కారు ఎస్‌యూవీ మోడల్‌ ఎక్స్‌షోరూం ధర రూ. కోటీ 79లక్షల 90వేలుగా స్పోర్ట్స్‌ మోడల్‌ ధర రూ. 2.05 కోట్లుగా ఆడి నిర్ణయించింది.

ఆడి సంస్థ తమ ఈవీ కారుని ఎస్‌యూవీ, స్పోర్ట్స్‌ బ్యాక్‌ మోడళ్లలో మార్కెట్లోకి తెస్తుండగా.. రెండు మోడళ్లలో స్టాండర్డ్‌, ఆర్‌ఎస్‌ వేరియంట్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ట్రాన్‌ కార్లలో 93 కిలోవాట్‌ లిథియమ్‌ ఐయాన్‌ బ్యాటరీ ఉండగా.. స్టాండర్డ్‌ వేరియంట్‌లో ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆర్‌ఎస్‌ ఈట్రాన్‌ కారు 637 బీహెచ్‌పీతో 830ఎన్‌ఎం టార్క్‌ని రిలీజ్‌ చేస్తుంది. స్టాండర్డ్‌ ఈ ట్రాన్‌ 523 బీహెచ్‌పీతో 630 ఎన్‌ఎం టార్క్‌ని రిలీజ్‌ చేస్తుంది.

3.3 సెకండ్ల నుంచి 4.1 సెకన్లలో గంటలకు వంద కిలోమీటర్ల వేగం అందుకుని కారు నడుస్తుంది. 2025 కల్లా ఇండియా ఈవీ మార్కెట్‌లో 25 శాతం మార్కెట్‌ వాటాని లక్ష్యంగా చేసుకుని ఆడి పనిచేస్తుంది. పవర్ బూస్ట్ తరువాత, ఈ ఆడి ఎలక్ట్రిక్ కార్లు 523bhp నుండి 637bhp వరకు శక్తిని ఉత్పత్తి చేయగలవు.