Bank FD Vs Post Office
Bank FD Vs Post Office Scheme : పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఎందులో పెట్టుబడి పెడితే సురక్షితం, రాబడి బాగుంటుందో తెలుసా? ప్రస్తుతం పెట్టుబడిదారులు (Bank FD Vs Post Office) సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ పథకాల పోర్ట్‌ఫోలియోపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. ఎక్కువమంది రిస్క్ లేని పెట్టుబడుల వైపే ఆసక్తి చూపిస్తుంటారు.
ఇప్పటికీ పోస్టాఫీస్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనే ఆధారపడేవాళ్లు లేకపోలేదు. కానీ, ఈ రెండింటిలో ఎందులో అధిక రాబడి వస్తుంది? అనేది తెలియదు. ఇంతకీ, బ్యాంకు FD బెటరా? లేదా పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి బెటరా? ఎందులో ఎక్కువ రాబడి వస్తుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సాధారణంగా సురక్షితమైన పెట్టుబడి అనగానే అందరికి పోస్టాఫీస్, బ్యాంక్ FD గుర్తుకువస్తాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ రెండింటి మధ్య కొద్దిగా గందోరగోళంగా అనిపిస్తుంటుంది. ఎందులో ఎక్కువ రాబడిని వస్తుందో తెలుసుకోవచ్చు.
బ్యాంక్ FDపై ఎంత వడ్డీ వస్తుందంటే? :
చిన్న లేదా పెద్ద బ్యాంకుల్లో ప్రస్తుతం 7 వడ్డీ నుంచి 8 శాతం వడ్డీ అందిస్తున్నాయి. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు రుణాలపై కూడా రాబడి పొందవచ్చు. లోన్ ఎక్కువ ఏళ్లకు తీసుకుంటేనే బ్యాంక్ FDలో మంచి రాబడి పొందవచ్చు.
పోస్టాఫీస్‌లో ఎంత రిటర్న్ వస్తుందంటే? :
పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్, సుకన్య పథకాల్లో అత్యధిక రాబడి అందిస్తున్నప్పటికీ అందరూ ఇందులో పెట్టుబడి పెట్టలేరు. పోస్టాఫీస్ సీనియర్ సీటిజన్ పథకంలో 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, సుకన్య పథకంలో బాలికలు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు.
పోస్టాఫీస్‌లో ఇలాంటి పథకాలు చాలానే ఉన్నాయి. అందులో పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. ప్రస్తుతం పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ పథకంలో 7.7 శాతం రాబడి పొందవచ్చు. మీరు ఈ పథకాన్ని రూ. 1000తో పెట్టుబడి పెట్టవచ్చు. ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ రెండింటిలో ఏది బెటర్ అంటే? :
బ్యాంకు FD లేదా పోస్టాఫీసు పథకాల్లో ఏది మంచిదంటే?.. మీరు ఏ బ్యాంకు FDలో పెట్టుబడి పెడుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు.. బ్యాంక్ FD ఎంత రాబడిని ఇస్తుందో కచ్చితంగా చెక్ చేయాలి.
బ్యాంక్ FDలో 7.5 శాతం కన్నా తక్కువ రాబడిని అందిస్తుంది. అందుకే, మీరు పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC) లేదా కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కిసాన్ పత్ర పథకంలో కూడా 7.5శాతం వరకు రాబడి పొందవచ్చు.