Bank Holidays August : ఆగస్టులో మీకు బ్యాంకు పని ఉందా? ఏకంగా 15 రోజులు బ్యాంకులు బంద్.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Bank Holidays August : ఆగస్టు 2025లో బ్యాంకులకు 15 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఏయే రాష్ట్రాల్లో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేయవంటే?

Bank Holidays August : ఆగస్టులో మీకు బ్యాంకు పని ఉందా? ఏకంగా 15 రోజులు బ్యాంకులు బంద్.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Bank Holidays August

Updated On : July 25, 2025 / 6:31 PM IST

Bank Holidays August : బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు నెల దగ్గర పడుతోంది. మీకు వచ్చే ఆగస్టులో బ్యాంకు పని ఉందా? అయితే, ముందుగానే మీ బ్యాంకు (Bank Holidays August) పనులను పూర్తి చేసుకోండి.

ఎందుకంటే.. ఆగస్టులో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు. అంటే సగం రోజులు బ్యాంకులు పనిచేయవు. ఏదైనా బ్యాంకు పని కోసం ప్లాన్ చేస్తుంటే వచ్చేనెలలో ఏయే బ్యాంకులు ఎన్ని రోజుల మూతపడనున్నాయో ఇప్పుడే తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆగస్టులో స్వాతంత్య్ర  దినోత్సవం, రక్షాబంధన్, జన్మాష్టమి, గణేష్ చతుర్థి వంటి స్థానిక, జాతీయ పండుగలు రానున్నాయి. అలాగే, అదే నెలలో రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవులు కూడా ఉన్నాయి.

దాంతో మొత్తం 15 రోజుల పాట బ్యాంకులు పనిచేయవు. అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు దాదాపు సగం నెల పాటు మూతపడనున్నాయి. అందుకే కస్టమర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే బ్యాంకు సంబంధిత పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలి.

Read Also : Apple iPhone 16e : పండగ చేస్కోండి.. ఆపిల్ కొత్త ఐఫోన్ 16e మరి ఇంత తక్కువా? అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

ఆగస్టు 2025లో రాష్ట్రాల వారీగా బ్యాంకు సెలవులివే :

  • ఆగస్టు 3 (ఆదివారం) : త్రిపురలో కేర్ పూజ రోజున బ్యాంకులు పనిచేయవు.
  • ఆగస్టు 8 (శుక్రవారం) : సిక్కిం, ఒడిశాలో టెండోంగ్‌ లో రమ్ ఫట్
  • ఆగస్టు 9 (శనివారం) : ఉత్తరాఖండ్, యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రక్షాబంధన్ పండగ
  • ఆగస్టు 13 (బుధవారం) : మణిపూర్‌లో దేశభక్తి దినోత్సవం (పెట్రోయిటిజమ్)
  • ఆగస్టు 15 (శుక్రవారం) : స్వాతంత్య్ర దినోత్సవం
  • ఆగస్టు 16 (శనివారం) : జన్మాష్టమి
  • ఆగస్టు 16 (శనివారం) : గుజరాత్, మహారాష్ట్ర, పార్సీ కొత్త సంవత్సరం
  • 26 ఆగస్టు (మంగళవారం) : కర్ణాటక, కేరళ, గణేష్ చతుర్థి
  • ఆగస్టు 27 (బుధవారం) : ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, గణేష్ చతుర్థి (రెండో రోజు)
  • ఆగస్టు 28 (గురువారం) : ఒడిశా, పంజాబ్, సిక్కిం : నువాఖై

ఆగస్టు 10, ఆగస్టు 23 తేదీలలో రెండో శనివారం, నాల్గో శనివారాలు, ఆగస్టు 3, 10, 17, 24, 31 తేదీలలో ప్రతి ఆదివారం కూడా అన్ని రాష్ట్రాల్లోనూ బ్యాంకులు పనిచేయవు.

బ్యాంకు కస్టమర్లు ఏం చేయాలి? :
ఈ ఆగస్టు నెలలో బ్యాంకులకు సగం రోజులు సెలవులు ఉన్నాయి. క్యాష్ విత్‌డ్రా, చెక్ క్లియరింగ్, ఇతర బ్యాంకింగ్ సేవలు పనిచేయవు. ఆగస్టు ప్రారంభంలోనే కస్టమర్లు ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవడం మంచిది. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM వంటి డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

రాష్ట్రాన్ని బట్టి బ్యాంకుల సెలవులు మారవచ్చు. లోకల్ లేదా కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం సెలవుల్లో మార్పులు ఉండొచ్చు. ఏదైనా బ్యాంకుకు వెళ్లే ముందు.. మీ బ్యాంక్ వెబ్‌సైట్ లేదా బ్రాంచ్ నుంచి హాలిడీస్ గురించి తెలుసుకోండి.