Bank Holiday 2025 : మీకు బ్యాంకులో పని ఉందా? అక్టోబర్ 13న అహోయ్ అష్టమి.. బ్యాంకులకు సెలవు ఉంటుందా? రాష్ట్రాల వారీగా ఫుల్ లిస్ట్..!
Bank Holiday 2025 : అక్టోబర్ 13న బ్యాంకులకు సెలవు ఉందా? మీకు ఈ రోజున బ్యాంకులో ఏదైనా పని ఉంటే ఇది మీకోసమే.. రాష్ట్రాల వారీగా బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదో చూద్దాం..

Bank Holiday 2025
Bank Holiday 2025 : అసలే పండగ సీజన్.. అందులోనూ అక్టోబర్ నెలలో దసరా నుంచి రాబోయే దీపావళి వరకు అన్ని సెలవులే ఉన్నాయి. అక్టోబర్ నెల దసరా సెలవులతో ప్రారంభమైంది. పండుగల సీజన్ కావడంతో వచ్చే వారం దేశవ్యాప్తంగా బ్యాంకులు చాలా రోజులు మూతపడనున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలు, ప్రాంతీయ పండుగల కారణంగా అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 19, 2025 మధ్య అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. వాస్తవానికి, అక్టోబర్ నెల నవరాత్రి, దుర్గా పూజ, కర్వా చౌత్, దీపావళి వంటి ప్రధాన పండుగల సమయంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
అక్టోబర్ 13న బ్యాంకులకు హాలీడే ఉందా? :
ఇప్పుడు అక్టోబర్ 13 (సోమవారం) కూడా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు మూతపడతాయా? లేదా అనేది చాలామందికి సందేహం ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకు పనిమీద వెళ్లేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయం. వాస్తవానికి, సోమవారం దేశవ్యాప్తంగా అహోయ్ వ్రత పండుగ. అహోయ్ అష్టమి కారణంగా అక్టోబర్ 13 సోమవారం బ్యాంకులు మూసివేయబడతాయా? లేదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అక్టోబర్ 13న అహోయ్ వ్రతం.. నో హాలిడే :
అహోయ్ వ్రతం అక్టోబర్ 13 (సోమవారం) రోజున జరుగుతుంది. అహోయ్ అష్టమి రోజున బ్యాంకులు పనిచేస్తాయి. అధికారికంగా ఆర్బీఐ సోమవారం సెలవు ప్రకటించలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలీడే క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 13, 2025 బ్యాంకులకు సెలవు ఉండదు. ఇతర రాష్టాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా సోమవారం బ్యాంకులు తెరిచే ఉంటాయి.
దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తెరిచే ఉంటాయి. ఎలాంటి ఆందోళన చెందకుండా ఏదైనా బ్యాంకింగ్ పనిని చూసుకోవచ్చు. హిందూ మతంలో తల్లులు తమ పిల్లల దీర్ఘాయుష్షు కోసం అహోయ్ అష్టమి ఉపవాసం పాటిస్తారు. ఈ ఉపవాసం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష, అష్టమి తిథి (8వ రోజు) రోజున పాటిస్తారు.
రాష్ట్రాల వారీగా బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదిగో :
- అక్టోబర్ 13 : అహోయ్ అష్టమి వ్రతం (నో హాలిడే) బ్యాంకులు పనిచేస్తాయి.
- అక్టోబర్ 18: కటి బిహు (కొంగలి బిహు) రోజున అస్సాంలో బ్యాంకులు పనిచేయవు.
- అక్టోబర్ 20: దీపావళి, నరక చతుర్దశి, కాళీ పూజలకు 20కి పైగా రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి.
- అక్టోబర్ 21: లక్ష్మీ పూజ, గోవర్ధన్ పూజ రోజున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాలో బ్యాంకులు పనిచేయవు.
- అక్టోబర్ 22: దీపావళి, బలిపాడ్యమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో బ్యాంకులు పనిచేయవు.
- అక్టోబర్ 23 : బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాలు భాయ్ దూజ్, చిత్రగుప్త జయంతి రోజున బ్యాంకులకు సెలవు.
- అక్టోబర్ 27 : పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లలో ఛట్ పూజ రోజున బ్యాంకులు పనిచేయవు.
- అక్టోబర్ 28 : బీహార్, జార్ఖండ్‌లలో ఛట్ పూజ రోజున బ్యాంకులు మూతపడతాయి.
- అక్టోబర్ 31 : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున గుజరాత్‌లో బ్యాంకులు పనిచేయవు.
బ్యాంకు సెలవు దినాల్లో కూడా ఏటీఎం సర్వీసులు 24/7 పనిచేస్తాయి. బ్యాంకు సెలవు దినాల్లో ఏదైనా ఆన్‌లైన్ లావాదేవీలకు NEFT, IMPS, RTGS వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.