Bank Holiday Today (Image Credit To Original Source)
Bank Holiday Today : ఈరోజు మీరు బ్యాంకులో ఏదైనా పని పెట్టుకున్నారా? అయితే, ఇది మీకోసమే.. పండుగ రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే, బ్యాంకు సెలవులను భారత రిజర్వ్ బ్యాంక్ బ్యాంకు (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారమే నిర్ణయిస్తుంది.
సాధారణంగా పండగుల రోజున దేశమంతటా బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా మూతపడతాయా అనేది చాలామందిలో గందరగోళం ఉంటుంది. ఈసారి జనవరి 14న మకర సంక్రాంతి వచ్చింది. తెలుగు రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాల్లో ఈ రోజు బ్యాంకులు పనిచేయవు.
జనవరి 14న బ్యాంకులకు సెలవు :
ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. జనవరి 14న బ్యాంకులకు సెలవు ఉంది. ఈ రోజున ఆయా ప్రాంతాలలోని అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు మూతపడతాయి. మకర సంక్రాంతితో పాటు, దేశవ్యాప్తంగా పొంగల్ వంటి ఇతర పండుగలు జరుపుకుంటారు. అందుకే బ్యాంకులకు సెలవు ఉంటుంది.
బ్యాంకులకు సెలవులు అనేది ముఖ్యంగా బ్రాంచులు ఉన్న ఆయా రాష్ట్రాలపై ఆధారపడి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిలీజ్ చేసిన అధికారిక బ్యాంకు సెలవు క్యాలెండర్ ప్రకారం.. అనేక నగరాలు, రాష్ట్రాల్లో జనవరి 14న బ్యాంకులు పనిచేయవు. ప్రత్యేకించి గుజరాత్, ఒడిశా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మకర సంక్రాంతి ఇతర పంట పండుగలను జరుపుకోనున్నందున ఈరోజు బ్యాంకులకు సెలవు ఉంటుంది.
Bank Holiday Today (Image Credit To Original Source)
జనవరి 15 బ్యాంకు సెలవులు :
జనవరి 15, గురువారం, కర్ణాటక, తమిళనాడు, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
జనవరి 16 బ్యాంకు సెలవులు :
జనవరి 16 తిరువళ్లువర్ దినోత్సవం. ఈరోజున తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్యాంకులు మూతపడతాయి.
జనవరి 17 బ్యాంకు సెలవులు :
ఉజావర్, తిరునాల్ సందర్భంగా జనవరి 17న తమిళనాడులో బ్యాంకులు పనిచేయవు.
జనవరి 23 బ్యాంకు సెలవులు :
జనవరి 23న పశ్చిమ బెంగాల్, ఒడిశాలో బ్యాంకులు మూతపడతాయి. జనవరి 23న సరస్వతి పూజ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు కూడా.
జనవరి 26 బ్యాంకు సెలవులు :
జనవరి 26న రిపబ్లిక్ డే.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అన్ని బ్యాంకులు పనిచేయవు. ఈ రోజున బ్రాంచ్ సర్వీసులు క్లోజ్ అయినప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్,ఏటీఎం,యూపీఐ సర్వీసులు, ఇతర సేవలు అందుబాటులో ఉంటాయి.
ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చు :
మీకు అత్యవసరంగా డబ్బులు అవసరం పడితే బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు. బ్యాంకులకు సెలవు రోజుల్లో మీరు డబ్బులు ఎవరికైనా పంపాలన్నా ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే.. బ్యాంకు సెలవుల్లో కూడా స్టేట్‌మెంట్ లేదా ఏదైనా ఇతర అవసరాల కోసం ఏటీఎం సేవలు 24×7 అందుబాటులో ఉంటాయి. ఏటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
బ్యాంకులకు సెలువు ఉన్న రోజుల్లో ఆన్‌లైన్‌లో డబ్బులు పంపేందుకు NEFT, IMPS, RTGS ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు.. యూపీఐ ద్వారా కూడా డబ్బులు పంపుకోవచ్చు. బ్యాంకులకు హాలిడే ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసులు పనిచేస్తాయి.