Mutual Funds Loans : మ్యూచువల్ ఫండ్ నుంచి రుణాలు తీసుకోవచ్చా? రిస్క్ ఏమైనా ఉంటుందా? ప్రయోజనాలేంటి? కలిగే నష్టాలేంటి?

Mutual Funds Loans : మ్యూచువల్ ఫండ్ నుంచి లోన్లు తీసుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. ఈ లోన్లపై కలిగే ప్రయోజనాలు కన్నా కలిగే నష్టాలే ఎక్కువగా ఉండవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..

Mutual Funds Loans

Mutual Funds Loans : మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. కానీ, అదే మ్యూచువల్ ఫండ్లపై ఏదైనా లోన్లు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఇది సరైన పద్ధతి కాదు. మ్యూచువల్ ఫండ్ నుండి రుణం తీసుకోవడం అంటే.. మీరు మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను పూచీకత్తు ద్వారా రుణం తీసుకోవడం అనమాట..

ఇలా తీసుకునే లోన్లపై అధిక ప్రభావం ఉంటుంది. ఈ లోన్లపై కలిగే ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. రిస్క్ కూడా ఉంటుందని గమనించాలి. ఇంతకీ మ్యూచువల్ ఫండ్ ద్వారా లోన్లు తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : iQOO vs Poco vs Nothing : ఈ మూడు ఫోన్లు కిర్రాక్.. పోటాపోటీ ఫీచర్లు.. ఏది కొంటే బెటర్..? రూ.25వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా?

మ్యూచువల్ ఫండ్లతో ప్రయోజనాలివే :
తక్కువ వడ్డీ రేట్లు :
మ్యూచువల్ ఫండ్ల నుంచి తీసుకునే రుణాలపై వడ్డీ రేటు సాధారణంగా వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కన్నా తక్కువగా ఉంటుంది.
ప్రాసెసింగ్ : మ్యూచువల్ ఫండ్ నుంచి రుణం తీసుకునే ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. పెద్దగా పేపర్ వర్క్ అవసరం లేదు
రుణానికి వేరే ఆస్తి అక్కర్లేదు : ఈ రుణంలో మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు మాత్రమే తనఖా పెడతాయి. దీనికి వేరే ఆస్తి అవసరం లేదు.

నష్టాలివే :
పెట్టుబడిపై ప్రభావం :
మ్యూచువల్ ఫండ్ యూనిట్లు పడిపోతే.. మీరు భారీగా నష్టాలను చవిచూడవచ్చు. రుణం తిరిగి చెల్లించేందుకు ఉన్న ఆస్తులను అమ్మవలసి రావచ్చు. తద్వారా మీ పెట్టుబడిపై ప్రభావం చూపవచ్చు.
వడ్డీ చెల్లించడం : మీరు రుణ వాయిదాలను సకాలంలో చెల్లించడంలో విఫలమైతే.. వడ్డీ పెరుగుతుంది. మొత్తం తిరిగి చెల్లించే డబ్బులు పెరుగుతాయి.
రిస్క్ : మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విలువ తగ్గితే.. రుణ మొత్తంలో ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. మీ యూనిట్లను విక్రయించాల్సి రావచ్చు.

Read Also : Bajaj Electric : ఓలా, ఏథర్ ఇక కాస్కోండి.. బజాజ్ మరో సంచలనం.. పెట్రోల్ బండ్లు దండగ.. తక్కువ ధరలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందిగా..!

మీరు మ్యూచువల్ ఫండ్ నుంచి రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? మీరు రుణాన్ని తిరిగి చెల్లించగలరని నిర్ధారించుకోవాలి. మీరు పెట్టుబడి పెడుతున్న మ్యూచువల్ ఫండ్ ఎలా ఉంటుందో కూడా గమనించాలి. మీ ఆర్థిక స్థితి బలంగా ఉండాలంటే.. మీరు రిస్క్ తీసుకునేందుకు రెడీగా ఉండాలి. అప్పటివరకూ ఇది బెస్ట్ ఆప్షన్ కావచ్చు.