iQOO vs Poco vs Nothing : ఈ మూడు ఫోన్లు కిర్రాక్.. పోటాపోటీ ఫీచర్లు.. ఏది కొంటే బెటర్..? రూ.25వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా?
iQOO vs Poco vs Nothing : కొత్త స్మార్ట్‌ఫోన్ ఏది బెటర్.. ఐక్యూ నియో 10R, పోకో X7 ప్రో, నథింగ్ ఫోన్ 3ఎ.. రూ. 25వేల లోపు ధరలో ఈ మూడు ఫోన్లలో ఫీచర్లు, ధర పరంగా ఏది కొంటే బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

iQOO vs Poco vs Nothing
iQOO vs Poco vs Nothing : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రత్యేకించి ఈ మార్చిలో రూ. 25వేల లోపు ధరలో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ఇటీవలే ఐక్యూ, నథింగ్ మొబైల్ తయారీదారులు కొత్త మిడ్-రేంజ్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో రూ. 25వేల లోపు బెస్ట్ ఫోన్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో పోకో ఇండియా కూడా పోకో X7 ప్రో లాంచ్ చేసింది.
ఇప్పటికే ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో అత్యంత పాపులర్ పొందిన ఫోన్లలో ఒకటిగా నిలిచింది. అయితే, ఈ మూడు కంపెనీల ఫోన్లలో ఏది బెస్ట్ ఫోన్ ఏంటి? ఫీచర్లు, ధరల మధ్య తేడాలు వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
ఐక్యూ నియో 10R స్పెసిఫికేషన్లు :
ఐక్యూ నియో 10R ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. స్క్రీన్ 4,500 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో 3,840Hz PWM డిమ్మింగ్, HDR10+ సర్టిఫికేషన్‌ను అందిస్తుంది. 4nm TSMC ప్రాసెస్‌పై రూపొందిన స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3 చిప్‌సెట్‌తో అమర్చి ఉంది.
ఈ ఫోన్ 1.7 మిలియన్లకు పైగా AnTuTu బెంచ్‌మార్క్ స్కోర్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5 గంటల వరకు 90fps గేమింగ్ మోడ్, 2,000Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, ఇ-స్పోర్ట్స్ మోడ్‌ను కలిగి ఉంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. బ్యాక్ కెమెరా సిస్టమ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP సోనీ ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 32MP యూనిట్ కలిగి ఉంది.
ఈ ఫోన్ 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 6,400mAh బ్యాటరీని కలిగి ఉంది. 7.98mm మందం కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఐదు ఏళ్లు వాడిన తర్వాత బ్యాటరీ 80 శాతానికి పైగా హెల్త్ ప్రొటెక్షన్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
పోకో ఎక్స్ 7 ప్రో స్పెసిఫికేషన్లు :
పోకో X7ప్రో 5జీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందించే 6.73-అంగుళాల అమోల్డ్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 3200 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంది.
గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇన్‌స్టంట్ 2560Hz రేటుతో వస్తుంది. 4nm (TSMC) ప్రాసెస్‌పై రూపొందిన మీడియాటెక్ డైమన్షిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ ద్వారా ఆధారితమైన పోకో X7 ప్రో 5జీ, 3.25GHz వరకు క్లాక్ స్పీడ్‌లను అందుకోగలదు.
LPDDR5X మెమరీ, UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ సాలిడ్ ఎలక్ట్రోలైట్ టెక్నాలజీతో 6550mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. 90W హైపర్‌ఛార్జ్‌కు సపోర్టు ఇస్తుంది. దాదాపు 47 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేసేందుకు అనుమతిస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. పోకో X7 ప్రో 5Gలో f/1.59 ఎపర్చర్‌తో 50MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్టు అందిస్తుంది. అల్ట్రా-వైడ్ కెమెరా 120° ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8MP, ఫ్రంట్ కెమెరా 20MP కలిగి ఉంది. ఈ ఫోన్ 60fps వద్ద 4K వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా షావోమీ (HyperOS)పై రన్ అవుతుంది. మూడు ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. నీరు, ధూళి నిరోధకతకు IP66, IP68, IP69 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. పోకో ఫోన్ 1.5 మీటర్ల వరకు వాటర్ జెట్‌లు, సబ్‌మెర్షన్‌ను కూడా తట్టుకోగలదు.
నథింగ్ ఫోన్ 3a స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 3a మోడల్ 6.77 అంగుళాల Full HD+ అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఈ ఫోన్ పైభాగంలో పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. స్ప్లాష్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది.
12GB వరకు LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీకి సపోర్టు ఇస్తుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, ఒక ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 50MP 2x టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ షూటర్ ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 50W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కానీ, బాక్స్ లోపల అడాప్టర్ లేదు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నథింగ్ OS 3.1పై రన్ అవుతుంది.
రూ. 25వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్ ఏంటి? :
ఈ మూడు ఫోన్ల ధరలు ఒకేలా ఉన్నప్పటికీ, ఐక్యూ నియో 10R, పోకో X7 ప్రో పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ పరంగా నథింగ్ ఫోన్ కన్నా చాలా మెరుగ్గా ఉన్నాయి. నథింగ్ ఫోన్ 3a మోడల్ Full HD+ ప్యానెల్‌తో పోలిస్తే.. ఈ రెండు ఫోన్లలో చాలా హై రిజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తాయి. వేగవంతమైన ఛార్జింగ్ వరుసగా (80W, 90W) కూడా ఉన్నాయి. అదే సమయంలో బాక్స్‌లో ఛార్జర్‌ను కూడా అందిస్తున్నాయి.
పోకో X7 ప్రో మోడల్ వాటర్, డస్ట్ నిరోధకతకు ఐపీ69 రేటింగ్‌తో వచ్చే ఏకైక ఫోన్. 50MP టెలిఫోటో షూటర్ కలిగి ఉంది. కానీ, కెమెరా ఆప్టిమైజేషన్ పరంగా పెద్దగా ఏమిలేదనే చెప్పాలి. కెమెరా క్వాలిటీనే డిఫెక్ట్. పోకో, ఐక్యూ ఫోన్లలో ఉండే LPDDR5x ర్యామ్, UFS 4.0 స్టోరేజ్‌తో పోలిస్తే.. నథింగ్ ఫోన్ కన్నా LPDDR4x ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ చాలా తక్కువగా ఉన్నాయి.