Bengaluru: స్టార్టప్‌లలో అదరగొట్టిన బెంగళూరు.. 10.8 బిలియన్ డాలర్లతో నెంబర్-1
2021తో పోలిస్తే 2022 ఏడాదిలో స్టార్టప్ పెట్టుబడులు మందగించాయి. 2021లో బెంగళూరు నగరం 20.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూర్చింది. అయితే 2022 ఏడాదిలో అది సగానికి పడిపోయింది. ఇక యూనికార్న్ విషయంలో కూడా తగ్గుముఖం పట్టాయి. 2021లో 46 యూనికార్న్‌లు నమోదు కాగా 2022లో కేవలం 22 మాత్రమే నమోదు అయ్యాయి. కాగా, యూనికార్న్ సగటు పెట్టుబడులు 160 మిలియన్ డాలర్లని నివేదిక తెలిపింది.

Bengaluru top city top on startup funding in 2022
Bengaluru: ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు.. స్టార్టప్ రంగంలో దూసుకుపోతోంది. దేశంలో ఐటీ రంగంలో మెజారిటీ వాటా ఉన్న ఈ నగరం స్టర్టప్ పెట్టుబడుల్లో సైతం తన స్థాయిని నిలబెట్టుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైని ఎక్కడికో వెనక్కి నెట్టి, స్టార్టప్ అంటే బెంగళూరు, బెంగళూరు అంటే స్టార్టప్ అని నిలిచింది. గ్లోబల్ మార్కెట్ ఇంటలీజెన్స్ వేదిక అయిన ట్రాక్స్కాన్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. 2022 ఏడాదిలో బెంగళూరులో స్టార్టప్ కింద 10.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయట.
#GetOutRavi: గవర్నర్‌కు వ్యతిరేకంగా తమిళనాడు గోడలపై పోస్టర్లు.. నెట్టింట్లో ట్వీట్ల వర్షం
ఇక 3.9 బిలియన్ డాలర్లతో ముంబై రెండవ స్థానంలో ఉంది. ఇదే నగరం 2021 సంవత్సరలో 5.2 బిలియన్ డాలర్ల స్టార్టప్ పెట్టుబడులు సాధించడం గమనార్హం. 2.6 బిలియన్ డాటర్లతో గురుగ్రామ్ మూడవ స్థానాన్ని ఆక్రమించింది. దేశ రాజధాని ఢిల్లీ సహా చెన్నై నగరాలు 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని సాధించాయి. వీటి అనంతరం మహారాష్ట్ర రెండవ అతిపెద్ద నగరం పూణె 1 బిలియన్ డాలర్లు రాబట్టింది.
Karnataka: బస్సు యాత్ర కోసం రెండు గ్రూపులుగా ఏర్పడ్డ కాంగ్రెస్
2021తో పోలిస్తే 2022 ఏడాదిలో స్టార్టప్ పెట్టుబడులు మందగించాయి. 2021లో బెంగళూరు నగరం 20.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూర్చింది. అయితే 2022 ఏడాదిలో అది సగానికి పడిపోయింది. ఇక యూనికార్న్ విషయంలో కూడా తగ్గుముఖం పట్టాయి. 2021లో 46 యూనికార్న్‌లు నమోదు కాగా 2022లో కేవలం 22 మాత్రమే నమోదు అయ్యాయి. కాగా, యూనికార్న్ సగటు పెట్టుబడులు 160 మిలియన్ డాలర్లని నివేదిక తెలిపింది.
Bengaluru: నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి తల్లీ కొడుకు మృతి