#GetOutRavi: గవర్నర్‭కు వ్యతిరేకంగా తమిళనాడు గోడలపై పోస్టర్లు.. నెట్టింట్లో ట్వీట్ల వర్షం

గవర్నర్ వాకౌట్ చేయడం పట్ల అధికార పార్టీ నేతలు, ఇతరులు #GetOutRavi రవి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని, అలా చేస్తే పరిణామాలు విపరీతంగా ఉంటాయంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. ఈ హ్యాష్‭ట్యాగ్‭తో రూపొందించిన పోస్టర్లు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న గోడలపై హల్ చల్ చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో సైతం నెటిజెన్లు రెచ్చిపోతున్నారు. ఈరోజు ట్విట్టర్ ఇండియాలో #GetOutRavi అనే హ్యాష్‭ట్యాగ్‭ టాప్ ట్రెండింగులో ఉంది

#GetOutRavi: గవర్నర్‭కు వ్యతిరేకంగా తమిళనాడు గోడలపై పోస్టర్లు.. నెట్టింట్లో ట్వీట్ల వర్షం

#GetOutRavi Posters In Chennai Amid Governor-MK Stalin Standoff

Updated On : January 10, 2023 / 2:30 PM IST

#GetOutRavi: తమిళనాడులో గవర్నర్‭కు అధికార పార్టీకి మధ్య రాజుకున్న వివాదం తారాస్థాయికి చేరింది. తమిళనాడు పేరును మరో విధంగా గవర్నర్ వ్యాఖ్యానిస్తుండడం, అలాగే అన్నాదురై, పెరియార్ వంటి పేర్లను ప్రస్తావించకపోవడం పట్ల తాజాగా అసెంబ్లీలోనే అగ్గి రాజేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ జోడించిన, దాటవేయబడిన భాగాలను తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గవర్నర్ ఎదుటే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో చేసేదేమీ లేక గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

Rahul Gandhi Bharat Jodo Yatra: హర్యానాలో ఉత్సాహంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఫొటో గ్యాలరీ

ఇక గవర్నర్ వాకౌట్ చేయడం పట్ల అధికార పార్టీ నేతలు, ఇతరులు #GetOutRavi రవి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని, అలా చేస్తే పరిణామాలు విపరీతంగా ఉంటాయంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. ఈ హ్యాష్‭ట్యాగ్‭తో రూపొందించిన పోస్టర్లు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న గోడలపై హల్ చల్ చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో సైతం నెటిజెన్లు రెచ్చిపోతున్నారు. ఈరోజు ట్విట్టర్ ఇండియాలో #GetOutRavi అనే హ్యాష్‭ట్యాగ్‭ టాప్ ట్రెండింగులో ఉంది. ఇక కొందరైతే గవర్నర్ రవిని ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకుల నుంచి కూడా ఈ ట్రెండింగుకు మద్దతు లభిస్తోంది.


ఇటీవల సీఎం స్టాలిన్, గవర్నర్ ఆర్. రవిలకు మధ్య బేధాభిప్రాయాలు కొనసాగుతున్న విషయం విధితమే. తాజాగా తమిళనాడును శాంతిస్వర్గంగా అభివర్ణిస్తూ లౌకికవాదం, పెరియార్, బీఆర్ అంబేద్కర్, కే. కామరాజ్, సీఎస్ అన్నాదురై, కరుణానిది వంటి నేతల ప్రస్తావనలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో కొన్ని భాగాలను గవర్నర్ చదవకుండా దాటవేశారని ముఖ్యమంత్రి తీర్మానంలో పేర్కొన్నారు. ఇదిలాఉంటే అధికార డీఎంకే ప్రచారం చేస్తున్న ద్రావిడ మోడల్ ప్రస్తావన కూడా గవర్నర్ చదవలేదని, గవర్నర్ చర్య అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధమని తీర్మానంలో స్టాలిన్ పేర్కొన్నారు. స్టాలిన్ తీర్మానానికి అధికార డీఎంకే మిత్రపక్షాలు, కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీఆర్), సీపీఐ, సీపీఐ(ఎం) లాంటి పార్టీలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించాయి. అసెంబ్లీలో ఆమోదం పొందిన 21 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు డీఎంకే మిత్రపక్షాలు ఆరోపించాయి. గవర్నర్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో నినాదాలు హోరెత్తాయి.

Union Budget 2023: కీలక మీటింగ్.. 13న ఆర్థికవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం..