Best Smart TV Deals (Image Credit To Original Source)
Best Smart TV Deals : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అనేక స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. మీరు కూడా కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్..
స్మార్ట్ టీవీల కొనుగోలుపై ఈ-కామర్స్ దిగ్గజం భారీ తగ్గింపు ధరకు ఆఫర్ చేస్తోంది. మీరు ప్రత్యేక తగ్గింపుతో బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కొనేసుకోవచ్చు. సేల్ సమయంలో కస్టమర్‌లు రూ. 5వేల కన్నా తక్కువ ధరకు స్మార్ట్ టీవీని ఇంటికి తెచ్చుకోవచ్చు.
ఫాక్స్ స్కై ఫ్రేమ్‌లెస్ స్మార్ట్ టీవీ మోడల్ విషయానికి వస్తే.. ఈ టీవీలో కీలక ఫీచర్ ద్వారా ఓటీటీ యాప్స్ నుంచి కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. కేబుల్ లేదా శాటిలైట్ సర్వీస్ కనెక్షన్‌ను కూడా అందిస్తుంది. Wi-Fi ద్వారా నేరుగా కనెక్ట్ చేయవచ్చు. ఈ టీవీ ఫీచర్లు, ధర, డిస్కౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
బ్యాంకు ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లు :
ఈ రిపబ్లిక్ డే సేల్ సమయంలో ఫాక్స్ స్కై 60cm (24 అంగుళాల) హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 2025 ఎడిషన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,499 ప్రత్యేక ధరకు లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో రూ.500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ.4,999కి తగ్గుతుంది.
Best Smart TV Deals (Image Credit To Original Source)
స్పెషల్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు :
మీ పాత టీవీతో రూ.1,900 వరకు స్పెషల్ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వాల్యూ అనేది మీ పాత టీవీ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఫాక్స్ స్కై స్మార్ట్ టీవీ కీలక స్పెసిఫికేషన్లు :
ఈ ఫాక్స్ స్కై స్మార్ట్ టీవీలో 24-అంగుళాల భారీ HD రెడీ (1366×768 పిక్సెల్స్) 60Hz డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్ టీవీ OSలో రన్ అవుతుంది. అనేక ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ అందిస్తుంది. క్వాడ్-కోర్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 30W పవర్ అందించే డ్యూయల్ స్పీకర్‌లతో పవర్‌ఫుల్ ఆడియో కూడా అందిస్తుంది.
ఫ్రేమ్‌లెస్ డిజైన్‌తో నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ఓటీటీ యాప్‌లతో ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. ఈ యాప్స్ ద్వారా వెబ్ సిరీస్, సీరియల్, సినిమాలు చూడొచ్చు. అంతేకాదు.. ఇతర మోడళ్ల టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిపై కూడా భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్‌లతో ఇంటికి తెచ్చుకోవచ్చు.