Amazon Smartwaches Sale : అమెజాన్‌లో అదిరే ఆఫర్లు.. ఆపిల్, శాంసంగ్ స్మార్ట్ వాచ్‌లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. 73శాతం తగ్గింపు..!

Amazon Smartwaches Sale : అమెజాన్ లో రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఆపిల్, శాంసంగ్ బ్రాండ్ స్మార్ట్ వాచ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఏకంగా 73శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

Amazon Smartwaches Sale : అమెజాన్‌లో అదిరే ఆఫర్లు.. ఆపిల్, శాంసంగ్ స్మార్ట్ వాచ్‌లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. 73శాతం తగ్గింపు..!

Amazon Smartwaches Sale (Image Credit To Original Source)

Updated On : January 18, 2026 / 3:02 PM IST
  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ఆఫర్లు
  • బ్రాండెడ్ హైఎండ్ స్మార్ట్ వాచ్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు
  • 73శాతం తగ్గింపుతో సరికొత్త స్మార్ట్‌వాచ్ కొనేసుకోవచ్చు
  • జీపీఎస్‌తో పాటు అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు

Amazon Smartwaches Sale : కొత్త స్మార్ట్ వాచ్ కొనేవారికి వండర్ ఫుల్ ఆఫర్లు.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా బ్రాండెడ్ హై-ఎండ్ స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఆపిల్, వన్‌ప్లస్, శాంసంగ్ వంటి కంపెనీల నుంచి అనేక మోడల్ వాచీలు లిస్టులో ఉన్నాయి. సేల్ సమయంలో హై-ఎండ్ స్మార్ట్‌వాచ్‌లు అత్యంత సరసమైన ధరకే లభిస్తున్నాయి. మీరు స్మార్ట్ వాచ్ కొనాలని చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు.. 73శాతం తగ్గింపుతో ఈ స్మార్ట్ వాచ్ డీల్స్ ఎలా పొందాలంటే?

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ :
అమెజాన్ సేల్ సమయంలో రూ. 50,999 ధర ఉన్న ఈ వాచ్‌ ఇప్పుడు కేవలం రూ. 13,999కే లభిస్తోంది. అంటే.. 73శాతం సేవ్ చేసుకోవచ్చు. ఇతర ప్రమోషన్ల ద్వారా అదనపు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వాచ్‌లో IP68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. 47mm సర్క్యులర్ డయల్, 40 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

ఆపిల్ వాచ్ SE 3 :
రూ. 25,900 విలువైన ఈ ఆపిల్ వాచ్‌ అమెజాన్ సేల్ సమయంలో 11శాతం తగ్గింపుతో కేవలం రూ. 22,999కే లభిస్తోంది. మరెన్నో ప్రమోషన్లతో అదనపు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ వాచ్‌లో IP68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. 40mm స్క్వేర్ డయల్, జీపీఎస్ సపోర్టు, 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

Amazon Smartwaches Sale

Amazon Smartwaches Sale (Image Credit To Original Source)

వన్‌ప్లస్ వాచ్ 2 :
ఈ స్మార్ట్ వాచ్ రూ. 27,999 ధర నుంచి ఇప్పుడు అమెజాన్‌లో 43శాతం తగ్గింపుతో రూ. 15,999కే లభిస్తోంది. అనేక ఆఫర్లతో మరింత డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ వాచ్ జీపీఎస్‌తో పాటు అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తుంది. 100 గంటల బ్యాటరీ లైఫ్, IP68, 5 ఏటీఎం వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌ కూడా అందిస్తుంది.

Read Also : Republic Day Sale 2026 : రిపబ్లిక్ డే సేల్‌ ఆఫర్లు.. ఈ 4 మోటోరోలా ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర తగ్గిందంటే?

అవుట్‌డోర్ రగ్డ్ అమాజ్‌ఫిట్ టి-రెక్స్ 3 :
రూ. 29,999 ధర గల ఈ స్మార్ట్ వాచ్ ఇప్పుడు అమెజాన్‌లో 37శాతం తగ్గింపుతో రూ.18,999కే లభిస్తోంది. అనేక ప్రమోషన్లతో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ అత్యవసర పరిస్థితుల్లో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ వాచ్ జీపీఎస్‌తో పాటు అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తుంది. 10 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, 27 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. వాచ్ రౌండ్ డయల్ 48 మి.మీ ఉంటుంది.

గార్మిన్ ఇన్స్టింక్ట్ 2X సోలార్ వాచ్ :
ఈ సోలార్ వాచ్ రూ.52,999 ధర ఉండగా ఇప్పుడు అమెజాన్‌లో 43శాతం తగ్గింపుతో లభిస్తోంది. డిస్కౌంట్ ధర ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.29,990 మాత్రమే. ఇతర ప్రమోషన్ల ద్వారా అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. స్మార్ట్‌వాచ్ జీపీఎస్‌తో పాటు అనేక హెల్త్ ట్రాకింగ్ కెపాసిటీతో వస్తుంది. ఇందులో సోలార్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది.