Republic Day Sale 2026 : రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు.. ఈ 4 మోటోరోలా ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర తగ్గిందంటే?
Republic Day Sale 2026 : రిపబ్లిక్ డే సేల్ సమయంలో 4 పవర్‌ఫుల్ మోటోరోలా ఫోన్లపై రూ. 4వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ మోటో ఫోన్లపై క్రేజీ ఆఫర్లు ఎలా పొందాలంటే?
Republic Day Sale 2026 (Image Credit To Original Source)
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు
- మోటోరోలా ఫోన్లపై రూ. 4వేలు డిస్కౌంట్
- మోటోరోలా జీ86 పవర్ 5జీ ఫోన్ రూ.15,999కే
Republic Day Sale 2026 : కొత్త మోటోరోలా ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. మీరు మోటోరోలా అభిమాని అయితే ఇది మీకోసమే.. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా మోటోరోలా ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
కొత్త మోటోరోలా ఫోన్ డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయాలంటే ఇంతకన్నా బెస్ట్ ఆఫర్లు మళ్లీ దొరకవు. సరసమైన ధరలో మీకు నచ్చిన మోటోరోలా ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇంతకీ ఈ సేల్ ఆఫర్లు ఎలా పొందాలో వివరంగా తెలుసుకుందాం..
మోటోరోలా G67 పవర్ 5జీ :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ రూ. 14,999కు లభిస్తుంది. పవర్‌ఫుల్ 7000mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. 50MP సోనీ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కూడా ఉంది. గేమింగ్, వీడియోలకు బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G :
ఈ సేల్ సమయంలో కేవలం రూ. 19,999కే మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జీ కొనేసుకోవచ్చు. ఈ మోటోరోలా ఫోన్ 1.5K ఆల్-కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. IP69 రేటింగ్‌తో సోనీ LYTIA 700C కెమెరాతో వస్తుంది. ఎంఐఎల్-ఎస్టీడీ-810H సర్టిఫికేషన్, ప్రీమియం వీగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తుంది. చూసేందుకు చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

Republic Day Sale 2026 (Image Credit To Original Source)
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో :
మోటోరోలా ఫోన్లలో ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 29,999 నుంచి రూ. 25,999కు కొనుగోలు చేయవచ్చు. ట్రిపుల్ 50MP ఏఐ కెమెరాతో వస్తుంది. ప్రస్తుతం ఈ మోటోరోలా ఫోన్‌పై రూ. 4వేలు నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ మోటో ఫోన్ 1.5K క్వాడ్-కర్వ్డ్ ట్రూ కలర్ డిస్‌ప్లేతో వస్తుంది. చూసేందకు ప్రీమియం లుక్ ఉంటుంది. భారీ 6000mAh బ్యాటరీ, 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్, IP68,IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది.
మోటో G86 పవర్ 5జీ :
కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా మోటోరోలా జీ86 పవర్ 5జీ ఫోన్ రూ.15,999కే లభిస్తోంది. భారీ 6720mAh బ్యాటరీతో వస్తుంది. 1.5K pOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో వస్తుంది. IP68, IP69 వాటర్, డస్ట్, రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది.
