Best Fridges 2026 : సమ్మర్లో కొత్త ఫ్రిజ్ కొంటున్నారా? 5 స్టార్ రేటింగ్‌తో రూ. 20వేల లోపు టాప్ రేటెడ్ రిఫ్రిజిరేటర్లు.. మీ ఫేవరెట్ ఫ్రిజ్ ఇదేనా?
Best Fridges 2026 : ఈ సమ్మర్లో రూ. 20 వేల లోపు ధరలో బెస్ట్ బ్రాండ్ రిఫ్రిజిరేటర్ కొనాలని అనుకుంటున్నారా? ఈ స్మార్ట్ ఫీచర్లతో 5 స్టార్ రేటింగ్ అందించే ఈ ఫ్రిజ్ మోడల్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
Best Fridges 2026
- కొత్త రిఫ్రిజిరేటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?
- రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ రిఫ్రిజిరేటర్లు ఇవే
- 5 స్టార్ రేటింగ్, ఆకట్టుకునేలా మరెన్నో స్మార్ట్ ఫీచర్లు
Best Fridges 2026 : అసలే సమ్మర్.. ఎండలు దంచికొడుతున్నాయి. ఇంట్లో కూలింగ్ కోసం ఏసీ తీసుకున్నట్టే.. ఫుడ్ స్టోరేజీ కోసం మంచి ఫ్రిజ్ కూడా ఉండాలి కదా.. మీరు కూడా కొత్త రిఫ్రిజిరేటర్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ.20వేల కన్నా తక్కువ బడ్జెట్లో అదిరిపోయే రిఫ్రిజిరేటర్ కొనేసుకోవచ్చు.
పవర్ ఫుల్ 5-స్టార్ రేటింగ్, పవర్ ఫుల్ ఇన్వర్టర్ కంప్రెసర్, 18 గంటల పాటు కూలింగ్ అందించే అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. భారతీయ ఫ్యామిలీ కస్టమర్లు ఎక్కువగా కొనుగోలు చేసే బ్రాండ్లలో గోద్రెజ్, హైయర్, బాష్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఎక్కువ పవర్ ఆదా చేయడమే కాకుండా, ఫుడ్ ఎక్కువ రోజులు తాజాగా ఉంచే మోడళ్లను అందిస్తున్నాయి. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ రిఫ్రిజిరేటర్ సరసమైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
గోద్రెజ్, హైయర్ :
పవర్ ఆదా, ఎక్కువ క్లీనింగ్ కోరుకునేవారి కోసం గోద్రెజ్ 194L 5-స్టార్ రిఫ్రిజిరేటర్ అద్భుతమైన ఆప్షన్. ఈ ఫ్రిజ్ ధర రూ. 16,990 ఉంటుంది. ‘టర్బో కూలింగ్’ ‘వెట్ కంట్రోల్’ వంటి పవర్ఫుల్ ఫీచర్లను అందిస్తుంది. కూరగాయలను వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంచుతాయి.
మీ బడ్జెట్ ధరలో హైయర్ 190L 5-స్టార్ కేవలం రూ. 15,290కే అందుబాటులో ఉంది. ఇందులో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ‘1-అవర్ ఐసింగ్’ టెక్నాలజీ. కేవలం ఒక గంటలో అద్భుతంగా మంచును గడ్డకట్టేలా చేస్తుంది. ఈ రెండు మోడళ్లు చిన్న ఫ్యామిలీలకు చాలా కంపర్ట్ అందిస్తుంది.
బోష్, వోల్టాస్ బెకో :
బిగ్ ఫ్యామిలీల కోసం ఈ బడ్జెట్లో బాష్ 226L 4-స్టార్ రిఫ్రిజిరేటర్ బెస్ట్ ఆప్షన్. పవర్ కట్ సమయంలో కూడా 18 గంటల వరకు కచ్చితమైన కూలింగ్‌ను అందిస్తుంది. పవర్ కట్ ఎక్కువడా ఉండే ప్రాంతాలకు బెస్ట్ చాయిస్ అనమాట.
రూ. 16,990 ధరలో వోల్టాస్ బేకో 208L 5-స్టార్ మోడల్, పండ్లు, కూరగాయలలోని విటమిన్లు కోల్పోకుండా ‘ఫ్రెష్ బాక్స్’ టెక్నాలజీతో వస్తుంది. రూ. 17,790 సరసమైన ధరలో లభించే బాష్ విశాలమైన స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
వర్ల్‌పూల్ విటామ్యాజిక్ ప్రో :
వర్ల్‌పూల్ విటామ్యాజిక్ ప్రో రిఫ్రిజిరేటర్ డిజైన్, లుక్ పరంగా చాలా బాగుంది. ఈ ఫ్రిజ్ ధర రూ. 17,490. ‘ఆటో డీఫ్రాస్ట్’ టెక్నాలజీతో వస్తుంది. ఫ్రీజర్‌లో మొండిగా పేరుకుపోయే మంచు సమస్యను కూడా ఈజీగా ఫిక్స్ చేయొచ్చు.
IFB, షార్ప్ వంటి బ్రాండ్లు కూడా ఈ బడ్జెట్లో సరసమైన ధరకే అద్భుతమైన కూలింగ్‌తో ఫ్రిజ్‌లను అందిస్తున్నాయి. వేసవిలో మంచి కూలింగ్ అందించే రిఫ్రిజిరేటర్ కావాలంటే వర్ల్‌పూల్ తీసుకోవడం బెటర్.
