JioHotstar IPL 2026 : పండగ చేస్కోండి.. IPL కోసం బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. మీ నెట్వర్క్ ఏదైనా మ్యాచ్ మిస్ కాకుండా చూడొచ్చు..!
JioHotstar IPL 2026 : ఐపీఎల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడాలని ఉందా? మీ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన రీఛార్జ్ ప్యాకులు అందుబాటులో ఉన్నాయి. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలో హై క్వాలిటీ స్ట్రీమింగ్ చూడొచ్చు.
JioHotstar IPL 2026
- ఐపీఎల్ 2026 లైవ్ స్ట్రీమింగ్ ప్లాన్లు
- క్రికెట్ మ్యాచ్‌ల కోసం బెస్ట్ రీఛార్జ్ ప్యాకులు
- జియోహాట్ స్టార్, ఎయిర్ టెల్, Vi డేటా ప్లాన్లు
- కేవలం రూ. 79 నుంచి క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు
JioHotstar IPL 2026 : ఐపీఎల్ ప్రియులకు పండగే.. ఐపీఎల్ 2026 సీజన్ మొదలైంది. లక్షలాది క్రికెట్ అభిమానులు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీలలో స్ట్రీమింగ్ కోసం హై డేటా ప్యాకుల కోసం తెగ వెతికేస్తుంటారు. ఈసారి, జియోహాట్‌స్టార్ మ్యాచ్‌లను మిస్ కాకుండా ఉండేందుకు లైవ్ స్ట్రీమింగ్ ప్లాన్లను అందిస్తోంది. మీరు కేవలం రూ. 79 నుంచి ప్లాన్‌తో ఐపీఎల్ మ్యాచ్, ఎంటర్ టైన్మెంట్ అన్నీ చూడొచ్చు.
ఉత్కంఠభరితమైన మ్యాచ్ చివరి ఓవర్ సమయంలో మీ డేటా అయిపోకూడదనుకుంటే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా (Vi) అందించే ఈ డేటా ప్లాన్లను అసలు మిస్ చేసుకోవద్దు. టాప్ రేంజ్ రీఛార్జ్ ప్యాక్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జియోహాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ :
ఐపీఎల్ 2026 ఫుల్ డిజిటల్ థ్రిల్ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. మీ మొబైల్లో స్ట్రీమింగ్ కోసం నెలవారీ రిచ్ ప్లాన్ కేవలం రూ. 79 నుంచి ప్రారంభమవుతుంది. ఏడాది పొడవునా క్రికెట్, ఎంటర్టైన్మెంట్ కోసం రూ. 499 మ్యాజిక్ వార్షిక ప్లాన్ అందిస్తోంది. డిజిటల్ యూజర్ల కోసం జియోహాట్‌స్టార్ హై-డెఫినిషన్ (HD) క్వాలిటీ, మల్టీ-కెమెరా యాంగిల్స్ వంటి ఫీచర్లతో స్ట్రీమింగ్‌ను అందిస్తుంది.
ఎయిర్టెల్, జియో రోజువారీ డేటా ప్లాన్లు :
మీరు ప్రతి మ్యాచ్‌ను ఫుల్ HD క్వాలిటీలో చూడాలనుకుంటే.. ఎయిర్టెల్ రూ. 449 మ్యాజిక్ ప్లాన్ తీసుకోవచ్చు. రోజుకు 4GB డేటాను అందిస్తుంది. ఎయిర్టెల్ రూ. 398కి రోజుకు 2GB డేటా ఆప్షన్ కూడా అందిస్తోంది.
జియో కస్టమర్ల కోసం రూ. 949 ప్లాన్ 84 రోజుల పాటు రోజుకు 2GB డేటాతో వస్తుంది. మీ రోజువారీ కోటా అయిపోతే, మ్యాచ్ చివరి క్షణాల్లో జియో రూ. 195కి లభించే 15GB బూస్టర్ ప్యాక్ కూడా అందిస్తోంది.
వోడాఫోన్ ఐడియా (Vi) :
కేవలం మ్యాచ్ సమయంలో మాత్రమే అదనపు డేటా అవసరమయ్యే క్రికెట్ ప్రియుల కోసం వోడాఫోన్ ఐడియా (Vi) యాడ్-ఆన్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వోడాఫోన్ ఐడియా రూ. 175 ప్రీమియం ప్యాక్ 28 రోజుల పాటు 10GB డేటాను అందిస్తుంది.
రూ. 248 ప్లాన్ 6జీబీ నెల రోజులు, రూ. 151కు 4జీబీ (90 రోజులు) ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం మ్యాచ్ చూడాలనుకునే యూజర్లకు ఈ చిన్న డేటా ప్యాక్‌లు అద్భుతంగా ఉంటాయి.
