Samsung Galaxy Z Fold 7 : శాంసంగ్ ఫోల్డబుల్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 10,000 డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే..?
Samsung Galaxy Z Fold 7 : శాంసంగ్ మడతబెట్టే ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ధర భారీగా తగ్గింది. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Samsung Galaxy Z Fold 7 : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన డిస్ప్లేతో వస్తుంది. మీరు కొత్త అడ్వాన్స్ ఫోల్డబుల్ డిజైన్‌కు అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. 2025లో రూ. 1,74,999 ధరతో లాంచ్ అయిన ఈ శాంసంగ్ ఫోన్ ఇప్పుడు భారీ ధర తగ్గింపుతో లభ్యమవుతోంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో సహా ఇతర డిస్కౌంట్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 ధర : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఇప్పుడు రూ. 1,64,999 ధరకు లభిస్తోంది. ఈ బ్రాండ్ లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే రూ. 10వేలు ధర తగ్గింపు అందిస్తోంది. మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉంటే.. అదనంగా రూ. 4,000 తగ్గింపు పొందవచ్చు. తద్వారా అసలు ధర నుంచి రూ. 1,60,999కి తగ్గుతుంది.

అవసరమైతే ఈఎంఐలో కూడా కొనేసుకోవచ్చు. ఈఎంఐ నెలకు రూ. 6,131 నుంచి ఉంటుంది. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే రూ. 63,300 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, కచ్చితమైన వాల్యూ అనేది ఫోన్ వర్కింగ్ కండిషన్, కొనుగోలు చేసిన తేదీ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 కొనాలా? వద్దా? : ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్ 8.9mm మందం, 215 గ్రాముల బరువుతో సన్నగా తేలికగా ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 8-అంగుళాలు, 6.5-అంగుళాల డ్యూయల్ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

అనేక గెలాక్సీ ఏఐ ఫీచర్లు, ఫోల్డ్ సిరీస్‌లో కంపెనీ ఫస్ట్ టైమ్ 200MP మెయిన్ కెమెరాను కూడా అందిస్తుంది. 25W ఛార్జింగ్‌తో 4,400mAh బ్యాటరీతో వస్తుంది. ఎస్ పెన్ లేని ఈ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ. 1,60,000 లక్షలు ఉంటుంది.

మీకు మంచి ఫోల్డబుల్ ఫోన్ కావాలంటే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 తీసుకోవచ్చు. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే ఫోల్డ్ 6 మోడల్ కూడా తీసుకోవచ్చు. లేదంటే శాంసంగ్ రాబోయే నెలల్లో గెలాక్సీ ఫోల్డ్ 8 కూడా లాంచ్ చేయనుంది.
