Best Phones 2024 : దీపావళి సేల్ ఆఫర్లు.. రూ. 30వేల లోపు ధరలో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Best Phones 2024 : ప్రస్తుతం మార్కెట్లో రూ. 30వేల లోపు అత్యుత్తమ 5 స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

Best Phones 2024 : దీపావళి సేల్ ఆఫర్లు.. రూ. 30వేల లోపు ధరలో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Best Phones under Rs 30k, Diwali sale

Updated On : October 22, 2024 / 5:31 PM IST

Best Phones 2024 : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ప్రారంభమైంది. అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. వివో లేటెస్ట్ టీ3 అల్ట్రా లేదా మోటోరోలా ఎడ్జ్ 50ప్రో వరకు అనేక కొత్త ఫోన్లపై తగ్గింపు పొందవచ్చు. ముఖ్యంగా అదనపు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లతో ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలను మరింత తగ్గించుకోవచ్చు. ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. ఇదే అద్భుతమైన అవకాశం. ప్రస్తుతం మార్కెట్లో రూ. 30వేల లోపు అత్యుత్తమ 5 స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

వివో టీ3 అల్ట్రా :
దీపావళి సేల్ సమయంలో వివో టీ3 అల్ట్రా ఫోన్ ఆకర్షణీయమైన ఆఫర్ పొందవచ్చు. ఈ వివో ఫోన్ రూ. 28,999 తక్కువ ధరకే లభిస్తుంది. డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. పెద్ద 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే విజువల్స్‌ను అందిస్తుంది. అయితే, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీని అందిస్తుంది. మీకు రోజంతా ఛార్జింగ్ వస్తుంది. కెమెరా సెటప్ కూడా ఆకట్టుకునే ఉంది. ముఖ్యంగా డే టైమ్ పవర్‌ఫుల్ షాట్‌లను అందిస్తుంది. పోర్ట్రెయిట్ మోడ్ నేచురల్ బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌ అందిస్తుంది. మీ ఫొటోలు ప్రొఫెషనల్‌గా కనిపిస్తాయి.

నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ :
నథింగ్ ఫోన్ డిజైన్ ప్రత్యేకమైనది. దీపావళి సేల్ సమయంలో కేవలం రూ. 21,999కే లభ్యమవుతుంది. నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ బడ్జెట్‌లో ఉన్నవారికి నిజంగా బెస్ట్ ఆప్షన్. ఈ నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, డైమెన్సిటీ 7350 ప్రో 5జీ చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. ఈ నథింగ్ ఫోన్ నథింగ్ఓఎస్‌లో రన్ అవుతుంది. క్లీన్, బ్లోట్‌వేర్-రహిత ఎక్స్‌‌పీరియన్స్ అందిస్తుంది. మూడు ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందిస్తుంది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు, 50ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ఫోన్ :
మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ఫోన్ ఇప్పుడు బ్యాంక్ డిస్కౌంట్‌లతో రూ. 27,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అద్భుతమైన డిజైన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 చిప్‌సెట్ కంటెంట్, సాధారణ మొబైల్ గేమింగ్ సపోర్టు చేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో మంచి బ్యాటరీ లైఫ్, సాలిడ్ డిస్‌ప్లే కలిగి ఉంది.
స్టైలిష్ ఫోన్ కోసం చూసేవారికి ఈ మోటోరోలా ఫోన్ బెస్ట్ ఆప్షన్.

ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ :
ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ అనేది దీపావళి సేల్ సమయంలో రూ. 25,200కి లభించే మరో బెస్ట్ ఆప్షన్. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రోలింగ్, పవర్‌ఫుల్ విజువల్స్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ 7050 చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. దాంతో పాటు 8జీబీ ర్యామ్, రోజువారీ వినియోగానికి మంచిది. 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఆప్షన్ కలిగి ఉంది. కానీ, ఒప్పో ఎఫ్27ప్రోప్లస్ ఐపీ69 రేటింగ్‌ సెగ్మెంట్‌లో మొదటి వాటర్‌ప్రూఫ్‌ ఫోన్ అని చెప్పవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ :
శాంసంగ్ ఫోన్ ప్రారంభంలో రూ. 59,999 వద్ద లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ సమయంలో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. బ్యాంక్ డిస్కౌంట్‌లతో ఈ ఫోన్ రూ. 27,549కి తగ్గించింది. ఏడాది క్రితం మార్కెట్లోకి వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఐపీ68 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్, టెలిఫోటో లెన్స్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎక్సినోస్ 2200 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 4,500mAh బ్యాటరీ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

Read Also : Flipkart Big Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్.. ఈ ఐఫోన్ మోడళ్లపై డిస్కౌంట్ ఆఫర్లు.. డోంట్ మిస్!