BGMI Relaunch : భారత్‌కు మళ్లీ బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ వచ్చేస్తోంది.. ఎప్పుడు డౌన్‌లోడ్ చేయొచ్చంటే?
BGMI Relaunch in India : మొబైల్ గేమ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మళ్లీ భారత్‌కు బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) వచ్చేస్తోంది. గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ దేశంలో BGMI గేమ్ రీలాంచ్ చేసే ప్రణాళికను అధికారికంగా ప్రకటించింది. గతంలో భారత ప్రభుత్వం ఈ రాయల్ గేమ్‌ను నిషేధించింది.

BGMI Relaunch in India on 3 months trial basis
BGMI Relaunch in India : మొబైల్ గేమ్ యూజర్ల కోసం భారత్‌కు మళ్లీ బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) గేమ్ రానుంది. ప్రముఖ గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ (Krafton) దేశంలో బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI)ని రీలాంచ్ ప్రణాళికను అధికారికంగా ప్రకటించింది. (battlegrounds mobile india) BGMI త్వరలో భారత్‌కు రానుందని, యాప్ స్టోర్లలో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. భారత ప్రభుత్వం ఇప్పటికే BGMI రాయల్ గేమ్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. క్రాఫ్టన్ ప్రణాళికలో భాగంగా BGMI ట్రయల్ ప్రాతిపదికన 3 నెలల పాటు అందుబాటులో ఉంటుందని భారత స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.
కంపెనీ సర్వర్ లొకేషన్‌లు, డేటా భద్రత మొదలైన సమస్యలకు సంబంధించి నిర్ధారణ తర్వాత #BGMI 3 నెలల ట్రయల్‌కు ఆమోదం తెలపనున్నట్టు ఆయన తెలిపారు. BGMI గేమ్ అనుమతిపై తుది నిర్ణయం తీసుకునే ముందు వచ్చే 3 నెలల్లో యూజర్లకు హాని, వ్యసనం వంటి మొదలైన ఇతర సమస్యలపై నిశితంగా గమనిస్తామని చంద్రశేఖర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read Also : ChatGPT App : ఆపిల్ ఐఫోన్లలో చాట్‌జీపీటీ యాప్ ఆగయా.. ఇక ఆండ్రాయిడ్‌లో ఎప్పుడంటే..?
డెవలపర్ ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించకపోతే మాత్రం భారత్‌లో BGMI గేమ్‌ని మళ్లీ నిషేధించే అవకాశం ఉంది. ఈ విషయంలో క్రాఫ్టన్‌ను భారత ప్రభుత్వాన్ని సంప్రదించిందని అన్నారు. కానీ, గేమ్ డెవలపర్ 3 నెలల ట్రయల్ గురించి ఇంకా చాలా వివరాలను వెల్లడించలేదని మంత్రి రాజీవ్ చెప్పారు.
త్వరలో ఆండ్రాయిడ్, యాప్ స్టోర్లలో BGMI డౌన్‌లోడ్ :
BGMI కార్యకలాపాలను రీలాంచ్ చేసేందుకు అనుమతిని పొందామని, త్వరలో గేమ్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రక్రియను ప్రారంభించామని కంపెనీ చెబుతోంది. ఈ సర్వీసును రీలాంచ్ చేసిన తర్వాత ఇతర వివరాలను ప్రకటిస్తామని క్రాఫ్టన్ ఇండియా సీఈఓ సీన్ హ్యూనిల్ సోహ్న్ అన్నారు. దేశంలో భద్రతా సమస్యల కారణంగా 2022 జూలైలో BGMI గేమ్ భారత్‌లో బ్యాన్ అయింది.

BGMI Relaunch in India on 3 months trial basis
ఇప్పుడు, BGMI రీఎంట్రీపై కంపెనీ విశ్వాసంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించినందుకు భారతీయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. తమకు మద్దతుగా నిలిచిన భారతీయ గేమింగ్ కమ్యూనిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొంది. BGMI యాప్ స్టోర్‌లలో (Android), (iOS)లో అతి త్వరలో డౌన్‌లోడ్ చేసేందుకు అందుబాటులో ఉంటుందని గేమ్ డెవలపర్ వెల్లడించారు.
BGMI తిరిగి రావడంపై క్రాఫ్టన్ ఇండియా ప్రభుత్వ వ్యవహారాల అధిపతి విభోర్ కుక్రేటి మాట్లాడుతూ.. బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) కార్యకలాపాలను రీలాంచ్ చేసేందుకు మమ్మల్ని అనుమతించినందుకు అధికారులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. దక్షిణ కొరియా సంస్థ భారతీయ చట్టానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో వర్తించే అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉండేలా అనేక చర్యలను చేపట్టనున్నట్టు తెలిపారు. అందరి సహకారంతో వినూత్న పద్ధతులను అవలంబించడం ద్వారా ఈ డొమైన్‌లో భారత్‌లో ముందంజలో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు.