PM Kisan Yojana
PM Kisan 20th installment : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN)20వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకం రైతులకు ఆర్థిక సాయం అందిస్తోంది.
ఈ పథకంలో ప్రతి ఏడాదిలో రైతుల బ్యాంకు ఖాతాకు రూ. 6వేలు చొప్పున ఆర్థిక సాయం విడతల వారీగా రూ. 2వేలు పడతాయి.
ఇప్పుడు రైతులకు సాయం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకంలో కొత్త మార్పు చేసింది. ఈ మార్పుతో రైతులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
PM Kisan పీఎం కిసాన్‌లో కొత్త మార్పు :
కొన్ని కారణాల వల్ల రైతుల ఖాతాలకు రావాల్సిన వాయిదాలు నిలిచిపోతున్నాయి. ఇలాంటి రైతులు చాలా మంది ఉన్నారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించింది. ఇకపై రైతులు ఎక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. మీరు నోడల్ అధికారుల మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఈ మార్పుతో రైతులకు భారీ ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే.. ఇప్పుడు వారు నోడల్ అధికారి సాయంతో పీఎం కిసాన్ కు సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
నోడల్ ఆఫీసర్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీని తెలుసుకోవడానికి మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని ఈ కింది విధంగా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
1. ముందుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్‌సైట్ (www.pmkisan.gov.in)కి వెళ్లండి.
2. ఆ తర్వాత, ఫార్మర్ కార్నర్‌కి వెళ్లి, సెర్చ్ యువర్ పాయింట్ కాంటాక్ట్ ఆప్షన్‌కి వెళ్లండి.
3. మీరు రాష్ట్ర నోడల్ అధికారులు, జిల్లా నోడల్ అధికారుల గురించి సమాచారం తెలుసుకోవచ్చు.
PM Kisan 20వ విడత ఎప్పుడు వస్తుంది? :
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత జూన్ 2025లో విడుదల కావచ్చని చెబుతున్నారు. గతంలో, ఈ పథకం 19వ విడత 2025 ఫిబ్రవరి 24న విడుదలైంది. 9.8 కోట్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. 2.4 కోట్ల మంది మహిళా రైతులు కూడా లబ్ధిదారులలో ఉన్నారు.