పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మీ డబ్బులు తీసుకోవడానికి రిటైర్మెంట్ వరకు ఆగనవసరం లేదు..
డబ్బులు తీసుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు కూడా చెప్పే అవసరం లేదు.

EPF
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. మీ డబ్బులు తీసుకోవడానికి రిటైర్మెంట్ వరకు ఆగే అవసరం ఉండకపోవచ్చు. ఉద్యోగం మానేసే వరకు లేదా రిటైర్ అయ్యే వరకు వేచి ఉండకుండానే ఈపీఎఫ్ డబ్బును తీసుకునేలా నిబంధనల్లో మార్పులు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రతి 10 సంవత్సరాలకోసారి ఈపీఎఫ్ డబ్బును తీసుకునే అవకాశాన్ని కల్పించాలనుకుంటోంది.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రతిసభ్యుడికి ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి డబ్బు తీసుకునే అవకాశాన్ని ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. దీని ద్వారా 30 సంవత్సరాల వయస్సులోనూ డబ్బు తీసుకోవచ్చు. డబ్బులు తీసుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు కూడా చెప్పే అవసరం లేదు.
కేవలం 60 శాతం వరకు మాత్రమే
కానీ, ఒక పరిమితిని విధించే ఆలోచనలో కూడా ప్రభుత్వంలో ఉంది. ఒకేసారి మొత్తం నిధిలో 60 శాతం వరకు మాత్రమే డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. మిగతా భాగం రిటైర్మెంట్ వంటి భవిష్య అవసరాల కోసం ఉంటుంది.
పాత నిబంధనలు ఎలా ఉన్నాయంటే?
- పూర్తిగా డబ్బు తీసుకునే అవకాశం రిటైర్ అయిన తర్వాత (వయసు 58)
- లేకపోతే 2 నెలలపాటు ఉద్యోగం లేనప్పుడు
- కొన్ని ప్రత్యేక అవసరాల కోసం మాత్రమే కొంత డబ్బు తీసుకునే అవకాశం
- ఇంటి నిర్మాణం
- వైద్య చికిత్స
- చదువు
- వివాహం సమయాల్లో..
ఈపీఎఫ్ నిబంధనల్లో ఇటీవలి మార్పులు
- ఇప్పుడు ఇంటి కొనుగోలు కోసం కేవలం 3 సంవత్సరాల తర్వాతే 90 శాతం డబ్బు తీసుకునే అవకాశం ఉంది (ఇంతకుముందు ఇది 5 సంవత్సరాలు)
- అడ్వాన్స్ క్లెయిమ్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. తద్వారా ఎలాంటి అనుమతులు అవసరం లేకుండా వేగంగా డబ్బు పొందే అవకాశం ఉంటుంది.