స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్.. BSNL మైండ్‌ బ్లోయింగ్ ఆఫర్.. రూ.1కే ప్రతిరోజు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌

ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తమ ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. "ఆజాది కా ప్లాన్ కేవలం రూ.1కే, బీఎస్ఎన్ఎల్‌తో నిజమైన డిజిటల్ స్వాతంత్ర్యం పొందండి" అని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్.. BSNL మైండ్‌ బ్లోయింగ్ ఆఫర్.. రూ.1కే ప్రతిరోజు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌

BSNL

Updated On : August 1, 2025 / 3:02 PM IST

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కేవలం రూ.1కే “ఆజాది కా ప్లాన్‌”ను ప్రకటించింది. దీని ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా వంటి ప్రయోజనాలు అందుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్ కొత్త యూజర్లకే వర్తిస్తుంది.

ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తమ ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. “ఆజాది కా ప్లాన్ కేవలం రూ.1కే, బీఎస్ఎన్ఎల్‌తో నిజమైన డిజిటల్ స్వాతంత్ర్యం పొందండి” అని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. ఈ ఆఫర్ ద్వారా బీఎస్ఎన్ఎల్ సర్వీసులను కొత్త యూజర్లకు అందించడమే ఆ సంస్థ లక్ష్యం.

ఆజాది కా ప్లాన్ ప్రయోజనాలు, గడువు
బీఎస్ఎన్ఎల్ ఆజాది కా ప్లాన్ కొత్త యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ధర రూ.1. యూజర్లు ఉచిత సిమ్‌తో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 2జీబీ డేటా పొందుతారు. వీటి గడువు 30 రోజులు.

ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ పొందేందుకు యూజర్లు తమకు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా రిటైలర్‌ వద్దకు వెళ్లాలి.

ఈ ఆఫర్‌తో పాటు, బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియను సులభతరం చేసింది. మీరు బీఎస్ఎన్ఎల్ ఎఫ్‌టిథెచ్ (ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్) లేదా ల్యాండ్‌లైన్ యూజర్ అయితే, 1800-4444 వాట్సాప్ నంబరుకు మెసేజ్‌ పంపితే మీ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇందుకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరే ఉపయోగించాలి.