Benefits of Investing in Gold: 2024లో బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే 6 లాభాలు ఇవే..

శతాబ్దాలుగా ప్రపంచంలో మనుషులకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్న అత్యంత విలువైన లోహం, స్థిరాస్తి బంగారం. బంగారం పెట్టుబడుల్లో రకాలు ఎన్నో తెలుసా?

బంగారంపై పెట్టుబడి పెడితే లాభమా? నష్టమా? అనే డైలమాలో ఉన్నారా? కొత్తగా వ్యాపారం చేయాలని, పెట్టుబడులు పెట్టాలని మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌లో రాసుకున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. బంగారంలో పెట్టుబడి అనేది మీకు ఓ బిజినెస్ ఐడియా కావచ్చు. శతాబ్దాలుగా ప్రపంచంలో మనుషులకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్న అత్యంత విలువైన లోహం, స్థిరాస్తి బంగారం.

బంగారంపై పెట్టుబడి వల్ల కలిగే లాభాలు

  • ద్రవ్యోల్బణం పెరిగితే దాని నుంచి రక్షిస్తుంది
  • మార్కెట్లో తగ్గుతున్న/పెరుగుతున్న ధరలకు అతీతంగా బంగారాన్ని డబ్బుగా మార్పిడి చేసుకోవచ్చు
  • ప్రపంచంలోని అన్ని దేశాల్లో బంగారాన్ని చెల్లుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది
  • కొన్ని సందర్భాల్లో బంగారంలో పెట్టుబడులకు పన్నుల పరంగా లాభాలు ఉంటాయి. ఇతర పెట్టుబడుల్లో ఇటువంటి బెనిఫిట్స్ ఉండవు
  • పెట్టుబడులకు స్వర్గధామం వంటిది ‘బంగారంపై పెట్టుబడి’
  • 2024లో ఆర్థిక అనిశ్చితి ఎదురైనా, మీ కుటుంబం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా దాని నుంచి బంగారం మిమ్మల్ని బయటపడేస్తుంది

బంగారం పెట్టుబడుల్లో రకాలు

  • ఫిజికల్ గోల్డ్- పసిడి ఆభరణాలు, నాణేలు, గోల్డ్ బార్ల వంటివి
  • డిజిటల్ గోల్డ్- పేటీఎం, గూగుల్ పే వంటి మొబైల్ వాలెట్ల ద్వారా కొనుగోలు చేసే పసిడి
  • పేపర్ గోల్డ్- గోల్డ్ బాండ్లు, ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటివి

Gold demand: 2024లో భారత్‌లో బంగారానికి విపరీతంగా డిమాండ్.. 5 కారణాలు చెప్పిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్