Child Aadhaar Card
Child Aadhaar Card : మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉందా? ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా చాలా అత్యవసరం. పాఠశాల అడ్మిషన్ నుంచి ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఏ పని అయినా ప్రతిచోటా ఆధార్ కార్డు అవసరం.
అందుకే, మీ ఇంట్లో 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉంటే.. ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును చాలా ఈజీగా పొందవచ్చు. పిల్లల ఆధార్ కార్డు కోసం ఐరీస్ స్కాన్ చేయవలసిన అవసరం లేదు. మీరు ఫింగర్ ఫ్రింట్ స్కాన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండానే పిల్లల ఆధార్ కార్డును ఈజీగా పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
బ్లూ ఆధార్ కార్డు ఎలా పొందాలంటే?:
పిల్లల ఆధార్ కార్డును బ్లూ ఆధార్ కార్డ్ అంటారు. ఈ ఆధార్ కార్డు ప్రత్యేకత ఏమిటంటే.. పిల్లల తల్లిదండ్రుల ఆధార్ కార్డుకు లింక్ అయి ఉంటుంది. ఇందుకోసం మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లవలసిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని బ్లూ ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.
మీరు ఇలా రిక్వెస్ట్ పెట్టుకోవడం ద్వారా చిన్న పిల్లల ఆధార్ కార్డును ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పోస్టాఫీసు నుంచి కొంతమంది మీ ఇంటికి ఒక మిషన్‌తో వచ్చి పిల్లల ఆధార్ కార్డును అందిస్తారు. ఇందుకు దాదాపు 10 రోజుల సమయం పట్టవచ్చు.
ఒకవేళ, 10 రోజుల్లో ఎవరూ మీ ఇంటికి రాకపోతే.. మీ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఆన్‌లైన్ రిక్వెస్ట్ గురించి అడిగి తెలుసుకోవచ్చు. ఆ తర్వాత అదే రోజున పోస్టాఫీసు నుంచి ఎవరైనా మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. మీ బిడ్డకు 5 ఏళ్ల వయస్సు దాటినప్పుడు, వారి ఫింగర్ ఫ్రింట్, రెటీనా స్కాన్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి.