iQOO Z10R Launch : ఐక్యూ నుంచి ఖతర్నాక్ ఫోన్.. 4K రికార్డింగ్, AI ఫీచర్లతో ఐక్యూ Z10R ఆగయా.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!
iQOO Z10R Launch : కొత్త ఐక్యూ ఫోన్ కోసం చూస్తున్నారా? ఐక్యూ Z10R ఫోన్ మీడియాటెక్ 7400 చిప్‌తో లాంచ్ అయింది. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..

iQOO Z10R Launch
iQOO Z10R Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో ఐక్యూ కొత్త Z10R వేరియంట్ వచ్చేసింది. ఐక్యూ Z10 సిరీస్ ఫోన్ అధికారికంగా (iQOO Z10R Launch) లాంచ్ అయింది. ఈ కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ SGSలో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ ప్యానెల్‌ను అందిస్తుంది.
ఈ ఐక్యూ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా, సర్కిల్ టు సెర్చ్, ఏఐ నోట్ అసిస్ట్, ఏఐ రికార్డింగ్ ట్రాన్స్‌క్రిప్షన్, ఇన్‌స్టంట్ టెక్స్ట్, ఏఐ స్క్రీన్ ట్రాన్స్‌లేషన్ వంటి ఏఐ ఫీచర్లను కూడా అందిస్తుంది. ఈ ఐక్యూ ఫోన్ జూలై 29 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. మొత్తం 3 వేరియంట్‌లలో లభిస్తుంది. ఐక్యూ Z10R ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐక్యూ Z10R స్పెసిఫికేషన్లు :
ఐక్యూ Z10R ఫోన్ 6.77-అంగుళాల క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్‌నెస్, FHD+ రిజల్యూషన్‌తో వస్తుంది. HDR10+ సపోర్టు ఇస్తుంది. డైమండ్ షీల్డ్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, ఈ ఐక్యూ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7400 5G చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు LPDDR4X ర్యామ్, 256GB వరకు UFS 2.2 స్టోరేజీతో వస్తుంది.
ఈ ఐక్యూ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,700mAh బ్యాటరీతో వస్తుంది. గేమింగ్ కోసం బ్యాటరీ హీట్ తగ్గేందుకు బైపాస్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్OS 15పై రన్ అవుతుంది.
కెమెరా విషయానికొస్తే.. ఐక్యూ ఫోన్ OISతో 50MP సోనీ IMX882తో వస్తుంది. 4K అల్ట్రా-క్లియర్ వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 2MP బోకె కెమెరా కూడా ఉంది. ఈ ఐక్యూ ఫోన్ ఫ్రంట్ సైడ్ AI ఫేస్ కరెక్షన్‌తో 32MP 4K సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
భారత్‌లో ఐక్యూ Z10R ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఐక్యూ Z10R ఫోన్ బేస్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,499కు పొందవచ్చు. 8GB, 256GB వేరియంట్ ధర రూ.21,499కు పొందవచ్చు. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.23,499కు పొందవచ్చు.
ఆసక్తిగల కస్టమర్లు రూ.2వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. ఐక్యూ ఇ-స్టోర్, అమెజాన్ ఎంపిక చేసిన రిటైల్ ఛానల్ పార్టనర్లకు అందుబాటులో ఉంటుంది.