Realme Narzo 80 Lite 4G : అతి చౌకైన ధరకే కొత్త రియల్‌మి నార్జో 4G.. ఫీచర్లు కేక.. సింగిల్ ఛార్జ్‌తో 2 రోజులు చిల్ అవ్వొచ్చు..!

Realme Narzo 80 Lite 4G : రియల్‌మి నార్జో 80 లైట్ 4G సరసమైన ధరకే వచ్చేసింది. ఫీచర్ల కోసమైన ఈ రియల్‌మి ఫోన్ కొనేసుకోవచ్చు..

Realme Narzo 80 Lite 4G : అతి చౌకైన ధరకే కొత్త రియల్‌మి నార్జో 4G.. ఫీచర్లు కేక.. సింగిల్ ఛార్జ్‌తో 2 రోజులు చిల్ అవ్వొచ్చు..!

Realme Narzo 80 Lite 4G

Updated On : July 24, 2025 / 1:46 PM IST

Realme Narzo 80 Lite 4G : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్‌మి ఇండియా అత్యంత సరసమైన ధరకు కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేసింది. అదే.. రియల్‌మి నార్జో 80 లైట్ ఫోన్. కంపెనీ నార్జో 80 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్.

ఇప్పటికేలో ఈ సిరీస్‌లో 80 లైట్, 80 ప్రో, 80x స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. గత నెలలో రియల్‌మి నార్జో 80 లైట్ 5G లాంచ్ కాగా, దీనికి ఈ ఫోన్ 4G వేరియంట్. యునిసోక్ T7250 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. LCD స్క్రీన్‌ కూడా ఉంది. 13MP డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంది.

రియల్‌మి నార్జో 80 లైట్ 4G ధర ఎంతంటే? :
రియల్‌మి నార్జో 80 లైట్ 4G ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,299కు పొందవచ్చు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ కూడా ఉంది. అసలు ధర రూ.8,299గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అబ్సిడియన్ బ్లాక్, బీచ్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. జూలై 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి రెగ్యులర్ సేల్‌కు అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ రూ. 700 కూపన్‌ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.

Read Also : Sony Bravia 5 TV : బాబోయ్.. 98 అంగుళాల సోనీ బ్రావియా 5 బిగ్ స్మార్ట్‌టీవీ.. మీ ఇంట్లో మినీ మూవీ థియేటర్‌ ఉన్నట్టే.. ధర ఎంతంటే?

రియల్‌మి నార్జో 80 లైట్ 4G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి నార్జో 80 లైట్ 4G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, 563 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.74-అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. యూనిసోక్ T7250 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 6GB వరకు ర్యామ్, 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మి యూఐ రన్ అవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ బూస్ట్, ఏఐ కాల్ నాయిస్ రిడక్షన్ 2.0, స్మార్ట్ టచ్ వంటి వివిధ ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.

కెమెరా ఫ్రంట్ సైడ్ 13MP ప్రైమరీ కెమెరా, సెకండీ కెమెరా కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. 4G, బ్లూటూత్ 5.2, Wi-Fi 5, GPS, USB టైప్-C సపోర్టు అందిస్తుంది. డస్ట్, వాటర్ రిసెస్టెన్స్ కోసం IP54-రేటెడ్ బిల్డ్‌ కలిగి ఉంది. ఈ రియల్‌మి మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్‌తో ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. 6,300mAh బ్యాటరీతో వస్తుంది. 15W ఛార్జింగ్‌తో 5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సింగిల్ ఛార్జ్ చేస్తే చాలు.. 2 రోజుల పాటు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదు.