Sony Bravia 5 TV : బాబోయ్.. 98 అంగుళాల సోనీ బ్రావియా 5 బిగ్ స్మార్ట్‌టీవీ.. మీ ఇంట్లో మినీ మూవీ థియేటర్‌ ఉన్నట్టే.. ధర ఎంతంటే?

Sony Bravia 5 TV : సోనీ బ్రేవియా 5 టీవీ చూశారా? అద్భుతమైన ఫీచర్లతో సినిమా థియేటర్ సౌండ్ క్వాలిటీ ఆకర్షణీయంగా ఉంది. ఫీచర్లు, ధర వివరాలివే..

Sony Bravia 5 TV : బాబోయ్.. 98 అంగుళాల సోనీ బ్రావియా 5 బిగ్ స్మార్ట్‌టీవీ.. మీ ఇంట్లో మినీ మూవీ థియేటర్‌ ఉన్నట్టే.. ధర ఎంతంటే?

Sony Bravia 5 TV

Updated On : July 24, 2025 / 12:37 PM IST

Sony Bravia 5 TV : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? సోనీ ఇండియా అధికారికంగా బ్రావియా 5 స్మార్ట్‌టీవీని ప్రవేశపెట్టింది. 98-అంగుళాల మోడల్ K-98XR55A లాంచ్ చేసింది. సోనీ అందించే టీవీలలో అతిపెద్ద టీవీ ఆఫర్. మీ ఇంటిని సినిమా థియేటర్‌గా మార్చేస్తుంది.

సినిమాటిక్ వ్యూ కోరుకునే వినియోగదారుల కోసం సూపర్ లార్జ్ టీవీగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. 98-అంగుళాల టెలివిజన్ 4K UHD (3840×2160) మినీ LED డిస్‌ప్లేను కలిగి ఉంది. సోనీ కాగ్నిటివ్ ప్రాసెసర్ XR ద్వారా పవర్ పొందుతుంది. ఈ బ్రావియా 5 టీవీ సోనీ XR బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్‌ను కలిగి ఉంది.

సినిమాటిక్ ఆడియో క్వాలిటీ :
మినీ LED టీవీలోని ఫీచర్లు ఎలాంటి లైటింగ్ కండిషన్లలో కూడా అద్భుతమైన కాంట్రాస్ట్ అందిస్తుంది. HDR10, HLG, డాల్బీ విజన్‌లకు సపోర్టు ఇస్తుంది, 40W అకౌస్టిక్ మల్టీ-ఆడియో స్పీకర్ సెటప్, సరౌండ్ సౌండ్ కోసం డాల్బీ అట్మోస్‌తో వస్తుంది. ఇంట్లో సినిమాటిక్ ఆడియో-విజువల్ క్రియేట్ చేస్తుంది. కాగ్నిటివ్ ప్రాసెసర్ XR ప్రాసెసర్ ఆధారంగా వీడియో, ఆడియోను ఆప్టిమైజ్ చేస్తుంది. కలర్, కాంట్రాస్ట్, డెప్త్, మూవెంట్స్ అడ్జెస్ట్ చేస్తుంది.

Read Also : Vivo V60 Price : వివో నుంచి మరో క్రేజీ ఫోన్.. ఫీచర్లు భలే ఉన్నాయిగా.. లాంచ్ ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

వీడియో కంటెంట్ కోసం టీవీలో స్టూడియో కాలిబ్రేటెడ్ మోడ్, డిడికేటెడ్ నెట్‌ఫ్లిక్స్ అడాప్టివ్, సోనీ పిక్చర్స్ కోర్ మోడ్‌లు ఉన్నాయి. కొత్త ప్రైమ్ వీడియో కాలిబ్రేటెడ్ మోడ్ లైవ్ స్పోర్ట్స్‌ విస్తరిస్తుంది. ఇంటిగ్రేటెడ్ సోనీ పిక్చర్స్ కోర్ సర్వీస్, డిస్‌ప్లే, సౌండ్ హార్డ్‌వేర్ కోసం ఆప్టిమైజ్ IMAX ఎన్‌హాన్స్‌డ్ టైటిల్స్‌తో సహా దాదాపు 4K బ్లూ-రే క్వాలిటీలో వైడ్ రేంజ్ ఫొటో లైబ్రరీకి యాక్సెస్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 6, బ్లూటూత్ 5.3, నాలుగు HDMI పోర్ట్‌లతో 4K 120Hz, eARC, VRR సపోర్టు చేస్తాయి.

గూగుల్ టీవీతో సపోర్టు :
ఇందులో రెండు USB పోర్ట్‌లు ఉన్నాయి. ఈ సోనీ టీవీ గూగుల్ టీవీ ద్వారా పవర్ పొందుతుంది. అంతేకాదు.. యాప్ ఎకో సిస్టమ్, వాయిస్ కంట్రోలింగ్ సపోర్టు ఇస్తుంది. ఈ సోనీ టీవీ స్టాండ్‌తో 2199 × 1325 × 488mm సైజుతో పాటు 71.4 కిలోల బరువు ఉంటుంది. రిమోట్, పవర్ కార్డ్, టేబుల్‌టాప్ స్టాండ్, సెటప్ గైడ్‌లతో వస్తుంది. DVB-T/T2, DVB-S/S2 ట్యూనర్‌లకు సపోర్టు ఇస్తుంది.

ధర, ఆఫర్లు :
సోనీ బ్రావియా టీవీ 5 మోడల్ 98 అంగుళాల ధర రూ. 6,49,990 ఉండగా, జూలై 23, 2025 నుంచి సోనీ సెంటర్స్, సోనీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, షాపాట్‌ఎస్‌సీ, ఎలక్ట్రానిక్స్ రిటైలర్లు, భారతీయ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది. లిమిటెడ్ టైమ్ లాంచ్ ఆఫర్‌లో భాగంగా సోనీ మూడేళ్ల వారంటీ, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై రూ. 25వేల క్యాష్‌బ్యాక్, నెలకు రూ. 19,995 ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.