Vivo V60 Price : వివో నుంచి మరో క్రేజీ ఫోన్.. ఫీచర్లు భలే ఉన్నాయిగా.. లాంచ్ ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

Vivo V60 Price : భారత మార్కెట్లోకి త్వరలోనే వివో V60 ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్ లాంచ్ కాకముందే ధర వివరాలు లీక్ అయ్యాయి.

Vivo V60 Price : వివో నుంచి మరో క్రేజీ ఫోన్.. ఫీచర్లు భలే ఉన్నాయిగా.. లాంచ్ ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

Updated On : July 24, 2025 / 11:40 AM IST

Vivo V60 Price : వివో అభిమానులకు అదిరిపోయే న్యూస్.. వివో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. అతి త్వరలో వివో V60 ఫోన్ లాంచ్ చేసేందుకు కంపెనీ (Vivo V60 Price) సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం.. వివో V60 ఫోన్ ధర వివరాలు లీక్ అయ్యాయి.

ఈ వివో ఫోన్ కెమెరా, డిజైన్, ఇతర ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి. పుకార్లను పరిశీలిస్తే.. వివో ఫోన్ రెండర్‌లు ఇంటర్నెట్‌లో కనిపించాయి. ఇది పిల్ ఆకారంలో బ్యాక్ కెమెరా ఐలాండ్ ఉన్నట్టుగా సూచిస్తుంది. లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్లు, ధర, అన్ని లీక్‌ వివరాలపై ఓసారి లుక్కేయండి..

వివో V60 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
స్మార్ట్‌ప్రిక్స్ నివేదిక ప్రకారం.. వివో V60 ఫోన్ ఆగస్టు 12న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే, ఈ బ్రాండ్ ఇంకా వివరాలను అధికారికంగా ధృవీకరించలేదు.

Read Also : UPI GST Tax : UPI యూజర్లకు బిగ్ అలర్ట్.. రూ.2వేలకుపైగా పేమెంట్లపై GST చెల్లించాలా? కేంద్రం వన్ షాట్ ఆన్సర్..!

వివో V60 ధర (అంచనా) :
వివో V60 ఫోన్ ధర రూ.37వేల నుంచి రూ.40వేల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. భారత మార్కెట్లో వివో V50 బేస్ మోడల్ ధర రూ.34,999కి లాంచ్ అయింది.

వివో V60 డిజైన్ (అంచనా) :
ఇటీవలే వివో ఫోన్ రెండర్‌లు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. మిస్ట్ గ్రే, మూన్‌లిట్ బ్లూ, ఆస్పియస్ గోల్డ్ అనే మూడు కలర్ వేరియంట్లు ఉండొచ్చు. గత మోడళ్ల మాదిరిగా కాకుండా వివో V60 కర్వ్ కాకుండా ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చు. ఇంకా, ఈ వివో V60 ఫోన్ ZEISS-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ పొందే అవకాశం ఉంది.