UPI GST Tax : UPI యూజర్లకు బిగ్ అలర్ట్.. రూ.2వేలకుపైగా పేమెంట్లపై GST చెల్లించాలా? కేంద్రం వన్ షాట్ ఆన్సర్..!

UPI GST Tax : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం యూజర్లకు బ్యాడ్ న్యూస్? రూ.2వేల కన్నా యూపీఐ లావాదేవీలపై GST పన్ను విధింపుపై కేంద్రం ప్రకటన చేసింది.

UPI GST Tax : UPI యూజర్లకు బిగ్ అలర్ట్.. రూ.2వేలకుపైగా పేమెంట్లపై GST చెల్లించాలా? కేంద్రం వన్ షాట్ ఆన్సర్..!

UPI GST Tax

Updated On : July 24, 2025 / 11:12 AM IST

UPI GST Tax : భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాలలో UPI సంచలనం సృష్టిస్తోంది. దేశంలో యూపీఐ ద్వారా లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి. కూరగాయల దగ్గర నుంచి కిరాణ సరుకుల వరకు అన్ని యూపీఐ పేమెంట్లు ఎక్కువగా చేస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ కోసం కూడా చాలా మంది ఇప్పుడు UPI పేమెంట్లపైనే ఆధారపడుతున్నారు. అయితే, యూపీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ ఆందోళనకు గురిచేస్తోంది.

GSTపై సోషల్ మీడియాలో పుకార్లు :
ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం యూజర్లకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్.. ఇకపై యూపీఐ ద్వారా రూ.2వేల కన్నా ఎక్కువ పేమెంట్లు చేస్తే టాక్స్ చెల్లించాల్సిందేనంటూ ఆన్‌లైన్‌లో ఊహాగానాలు వస్తున్నాయి. యూపీఐ లావాదేవీలపై పుకార్లకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది.

యూపీఐ చెల్లింపులపై అసలు పన్ను విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. యూపీఐ పేమెంట్లపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవిగా పేర్కొంది. యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.

Read Also : UPI New Rules : ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి..!

యూపీఐపై మంత్రిత్వ శాఖ క్లారిటీ :
నివేదిక ప్రకారం.. రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంటులో రూ. 2వేల కన్నా ఎక్కువ యూపీఐ లావాదేవీలపై GST విధించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా అని ప్రశ్నించారు. రూ.2వేలకు పైగా యూపీఐ పేమెంట్లపై ఎలాంటి పన్ను ఉండదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఇటీవలి పుకార్లపై స్పందిస్తూ.. రూ.2వేలకు పైగా లావాదేవీలపై GST విధించవచ్చనే నివేదికలు పూర్తిగా నిరాధారమైనవిగా మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.

పార్లమెంటులో ప్రభుత్వ స్పందన :
ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, జీఎస్టీకి సంబంధించిన నిర్ణయాలు GST కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా మాత్రమే తీసుకుంటారని, ఇప్పటివరకు అలాంటి సిఫార్సు ఏదీ చేయలేదని అన్నారు. ప్రస్తుతానికి, యూపీఐ లావాదేవీ మొత్తంతో సంబంధం లేకుండా వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) లేదా వ్యక్తి నుంచి మర్చంట్‌కు (P2M) ఏ రకమైన యూపీఐ లావాదేవీపైనా GST విధించరు.

ఆందోళన అక్కర్లేదు :
యూపీఐ పేమెంట్లపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. రూ. 2వేల కన్నా ఎక్కువ UPI లావాదేవీలపై GST చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతానికి యూపీఐ పేమెంట్లపై ఎలాంటి అదనపు పన్నులు లేవు. ఎప్పటిలానే యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చు.