నవోదయలో ఏంటీ ఘోరం : ఐదేళ్లలో 49 మంది స్టూడెంట్స్ సూసైడ్

కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలైన జవహర్ నవోదయ విద్యాలయాలలో గత ఐదు సంవత్సరాల్లో క్యాంపస్ లో 49 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2013 నుంచి 2017 వరకూ 49మంది విద్యార్థినీ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నవారిలో ఉన్నారు. వీరిలో సగం మంది దళిత, గిరిజన విద్యార్థులే కావటం ఆందోళన కలిగించే అంశం.
విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే జూలైలోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్లుగా కూడా లెక్కలు చెబుతున్నాయి. ఈ విషయంపై NVS కమిషనర్ బిశ్వజిత్ కుమార్ సింగ్ అంచనా ప్రకారంగా చూస్తే.. వేసవి సెలవుల సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపిన తర్వాత.. తిరిగి స్కూల్ కు వచ్చి ఆ వాతావరణానికి విద్యార్ధులు ఎడ్జెస్ట్ కావటానికి మధ్య జరిగే మానసిన సంఘర్షణ, ఒత్తిడితో ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిపారు.
1985-86లో ప్రారంభించిన జవహర్ నవోదయ విద్యాలయాలు (JNV) పేదరికంతో ఉన్న విద్యార్ధులే ఎక్కువగా ఉంటారు. జేఎన్వీలలో చదువుకున్న ఈ పేద పిల్లలు 6 సంవత్సరాల్లో.. 10 క్లాస్ లో 99 శాతం పైగా ఉత్తీర్ణత సాధించారు. అలాగే 12 వ తరగతి ( ఇంటర్ బేసిక్)లో 95 శాతం కంటే ఉత్తీర్ణత సాధించారు. సీబీఎస్ సిలబస్ లో జాతీయ సగటు కంటే ఈ పాస్ పర్సెంటేజ్ బెస్ట్ గా ఉన్నాయి.
జాతీయ పత్రిక నిర్వహించిన సర్వే చూస్తే.. దేశవ్యాప్తంగా 46 విద్యాలయాల్లో 41 నవోదయా బ్రాంచీలు విద్యార్ధుల ఆత్మహత్యల విషయంలో ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 635 JNVs లలో 2.8 లక్షల విద్యార్థులున్నారు.
2017 మార్చి 31 నాటికి 9 నుంచి 19 ఏళ్ల వయస్సులో 2.53 లక్షల మంది విద్యార్థులను 600 JNVలకు చేరుకునగా.. అదే సంవత్సరంలో, ఆత్మహత్యల సంఖ్య 14కు చేరుకున్నాయి.
ఆత్మహత్య ధోరణులను గుర్తించడం – క్యాంపస్ లో ఆత్మహత్యలు నివారించడానికి కావాల్సిన మార్గదర్శకాల జాబితా చేయగా స్కూల్ క్యాంపస్ లో ఒక ఆత్మహత్య జరుగుతున్నప్పుడు..ఆ బ్రాంచ్ కు ఆ బాధ్యతను తీసుకోవాలని మార్గదర్శకాలలో పొందుపరిచారు.
జవహర్ నవోదయ విద్యాసంస్థల నిబంధనల ప్రకారం.. ఈ పాఠశాలల్లో 75 శాతం సీట్లు గ్రామీణ పిల్లల కోసం కేటాయించారు.. అందువలన.. JNV ఒక జిల్లాకు 100 శాతం పట్టణ జనాభాతో మంజూరు చేయబడదు. ఒక నవోదయ విద్యాలయ క్లాసు 6 నుండి మొదలై క్లాస్ 12 వరకు వుంటుంది. 6 క్లాస్ లో దరఖాస్తులు మెరిట్ పరీక్ష ద్వారా మాత్రమే జరుగుతాయి. ప్రతి సంవత్సరం ప్రవేశ పరీక్ష కోసం ఎంతోమంది పేద విద్యార్ధులు దరఖాస్తులు చేసుకుంటున్నారు అంటే JNV ల కుండే ఆదరణ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.