Coriandrum Prices: భారీగా పెరిగిన కొత్తిమీర ధర.. కిలో ఏకంగా రూ.400 పలుకుతున్న వైనం

కొత్తిమీర ధర సాధారణంగా కిలో రూ.80-రూ.100 మధ్య ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆ ధర ఏకంగా రూ.400కి పెరిగిపోయింది. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. తెలంగాణలోని వరంగల్‌, ఖమ్మం మార్కెట్లకు కర్ణాటక నుంచే కొత్తి మీర వస్తుంది. ఇప్పుడు వాటి సరఫరా తగ్గడంతో ధరలు పెరిగాయి. మార్కెట్ కు చాలా తక్కువగా కొత్తిమీర వస్తోంది.

Coriandrum Prices: కొత్తిమీర ధర భారీగా పెరిగిపోయింది. ఇప్పటికే పెరిగిన కూరగాయల ధరల వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్యులు ఇప్పుడు కొత్తిమీర ధర పెరిగిపోవడంతో దాన్ని కొనకుండానే మార్కెట్ నుంచి వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం కొత్తమీర డిమాండుకు తగ్గ దొరకడం లేదు. దాని సరఫరా తగ్గిపోయిందని వ్యాపారులు అంటున్నారు. కొత్తిమీర ధర సాధారణంగా కిలో రూ.80-రూ.100 మధ్య ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆ ధర ఏకంగా రూ.400కి పెరిగిపోయింది.

కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. తెలంగాణలోని వరంగల్‌, ఖమ్మం మార్కెట్లకు కర్ణాటక నుంచే కొత్తి మీర వస్తుంది. ఇప్పుడు వాటి సరఫరా తగ్గడంతో ధరలు పెరిగాయి. మార్కెట్ కు చాలా తక్కువగా కొత్తిమీర వస్తోంది. నిన్న కొత్తిమీర కిలో రూ.400 వరకు పలికింది. మరోవైపు, మహబూబాబాద్‌ జిల్లాకు కూడా కొత్తి మీర సరఫరా తగ్గింది. సాధారణంగా రోజుకు 20 క్వింటాళ్ల కొత్తిమీర వచ్చేది. ఇప్పుడు కేవలం ఐదు క్వింటాళ్లలోపే వస్తోంది.

Pak PM Headphone falling : హెడ్‌ఫోన్ పెట్టుకోవటానికి పాక్ ప్ర‌ధాని తిప్పలు .. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ న‌వ్వులు..

ట్రెండింగ్ వార్తలు