Pak PM Headphone falling : హెడ్‌ఫోన్ పెట్టుకోవటానికి పాక్ ప్ర‌ధాని తిప్పలు .. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ న‌వ్వులు..

హెడ్‌ఫోన్ పెట్టుకోవటానికి నానా తిప్పలు పడ్డారు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్..ఆయన పడే తిప్పల్ని చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ ముసి ముసి నవ్వులు నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pak PM Headphone falling : హెడ్‌ఫోన్ పెట్టుకోవటానికి పాక్ ప్ర‌ధాని తిప్పలు .. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ న‌వ్వులు..

pm shehbaz sharif fails to fix his headphone Russian President putin laughs

Pak PM Headphone falling : హెడ్‌ఫోన్ పెట్టుకోవటానికి నానా తిప్పలు పడ్డారు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్..ఆయన పడే తిప్పల్ని చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ ముసి ముసి నవ్వులు నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాక్ ప్రధాని..రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశమైన సందర్భంగా అప్పటికే పుతిన్ చక్కగా హెడ్ ఫోన్ పెట్టేసుకున్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ మాత్రం హెడ్ ఫోన్ పెట్టుకోవటానికి కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని చూసి పుతిన్ చిన్నగా నవ్వుకున్న వీడియో వైరల్ అవుతోంది.

 

ఉజ్జెకిస్తాన్‌లోని స‌మ‌ర్ఖండ్ న‌గ‌రంలో షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ స‌మావేశాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మావేశాల‌కు హాజ‌రైన పాకిస్థాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్‌.. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో క‌లిసి ద్వైపాక్షిక సంభాష‌ణ‌ల్లో పాల్గొన్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ముఖాముఖి చ‌ర్చ జ‌రుగుతున్న సందర్భంగా పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ త‌న వ‌ద్ద ఉన్న హెడ్‌ఫోన్ల‌ను పెట్టుకోవటానికి ఇబ్బంది పడ్డారు. ఆ చెవికి ఈ చెవికి తిప్పారు. అయినా పెట్టుకోలేక‌పోయాడు. హెడ్‌ఫోన్‌ను చెవిలో పెట్టుకునేందుకు పాక్ ప్ర‌ధాని పాపం త‌డ‌బ‌డ్డాడు. దాన్ని చూసిన పుతిన్ త‌న‌లో తాను ముసి ముసిగా న‌వ్వుకున్నారు.

ఈక్రమంలో పాపం హెడ్ ఫోన్ తనకు తానే పెట్టుకోవటానికి మ‌రోసారి పాక్ ప్ర‌ధాని య‌త్నించారు. అబ్బే కుదర్లేదు. ఈలోగా మ‌ళ్లీ హెడ్‌ఫోన్ మ‌ళ్లీ చెవి నుంచి కింద ప‌డిపోయింది. ఆ స‌మ‌యంలో పుతిన్ మ‌రోసారి న‌వ్వాడు. పుతిన్ న‌వ్వులు ఆయ‌న మైక్‌లో వినిపించాయి. హెడ్‌ఫోన్ పెట్టుకోలేక‌పోయిన పాక్ ప్ర‌ధాని..ఓ అధికారి సాయం కూడా కోరారు. ఇదంతా లైవ్ కెమెరాలో రికార్డు అయ్యింది. హెడ్‌ఫోన్ పెట్టులేక‌పోయిన ప్ర‌ధాని షెహ‌బాజ్ దేశం పరువు తీశారంటూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆరోపించింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

కాగా ఓ సారి అమెరికా ప్రెసిడెంట్ జో బైడన్ తన కోటు తొడుక్కోవటానికి తెగ ఇబ్బంది పడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. గాలికి కోటు ఎగిరిపోతుంటే పాపం బైడన్ దాన్ని తొడుక్కోవటానికి నానా పాట్లు పడ్డారు. దీంతో ఆయన భార్య హెల్ప్ చేయటంతో కోటు వేసుకోగలిగారు. ఆ తరువాత కూడా ఓ చక్కటి సన్నివేశం జరిగింది. భర్తకు కోటు తొగటంలో సహాయం చేసిన భార్యకు బైడన్ సహాయం చేశారు.భార్య హెయిర్ క్లిప్ కింద పడిపోగా బైడన్ స్వయంగా తానే తీసి ఆమెకిచ్చారు.ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.