బతకాలంటే ఇవ్వాలి కదా : కార్పొరేట్ ట్యాక్స్ భారీగా తగ్గింపు

బతకాలంటే ఇవ్వాలి కదా : కార్పొరేట్ ట్యాక్స్ భారీగా తగ్గింపు

Updated On : September 20, 2019 / 6:22 AM IST

కేంద్రం.. పెట్టుబడి దారులను పెంచే ఉద్దేశ్యంతో కీలక నిర్ణయాలతో సంచలనాలకు తెరలేపింది. జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె.. ‘దేశీయ కంపెనీలకు, కొత్త ప్రొడక్షన్ కంపెనీలకు కార్పొరేట్ పన్ను ధరను తగ్గించాలని నిర్ణయించుకున్నాం. ఆర్థికంగా పుంజుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని వెల్లడించారు.

దేశీయ కంపెనీలకు 22శాతం చొప్పున ఆదాయపు పన్ను చెల్లించడానికి వీలు కల్పించనున్నారు. పన్ను కుదిస్తున్నామని ప్రకటించిన క్షణాల్లో మార్కెట్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 13వందల పాయింట్లు పైకి ఎగబాకగా నిఫ్టీ 10వేల 9వందలు మార్కుని దాటింది. మార్పులు చేపట్టిన తర్వాత పన్ను రేటును అన్ని విధాల కలిపి 25.2శాతంగా నిర్ణయించారు. ఇందులో ఎటువంటి ఇన్‌సెంటివ్స్‌ లేవు. 

2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధన అమలులోకి తీసుకురానున్నారు. ‘పెట్టుబడులు పెరగడమే లక్ష్యంగా 2019-20 సంవత్సరానికి నాటికి అమలులోకి తీసుకురానున్నాం’ అని సీతారామన్ తెలిపారు. ఆరేళ్లలో ఎప్పుడూ లేనంతగా జూన్ త్రైమాసికానికి 5శాతం ఆర్థికాభివృద్ధి పడిపోయింది. ఈ క్రమంలో పెట్టుబడులు పెరిగితే ఆర్థికంగా మెరుగవ్వచ్చనే ఆలోచనతో కేంద్రం దీనికి సిద్ధమైంది.