Croma AC Offers : టాటా క్రోమా సంచలనం.. ఏసీలు, కూలర్లపై దిమ్మతిరిగే ఆఫర్లు.. 24 గంటల్లోనే డెలివరీ.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Croma AC Offers : టాటా కంపెనీ క్రోమా ఇప్పుడు మీ నగరంలో ఏసీలు, కూలర్లను ఒకే రోజు డెలివరీ చేయనుంది. క్రోమా కస్టమర్లకు మెరుగైన షాపింగ్ కోసం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

Croma AC Offers

Croma AC Offers : బాబోయ్ సమ్మర్ వచ్చేసింది.. ఎండలు కొద్దికొద్దిగా పెరిగిపోతున్నాయి. ఉక్కపోతలు కూడా మొదలయ్యాయి. కాసేపు ఏసీ లేదా కూలర్ లేకుంటే కష్టమే మరి. అందుకే ఈ వేసవిలో చల్లదనం కోసం కొత్త ఏసీ లేదా కూలర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?

Read Also : Super Billionaires : వరల్డ్ టాప్ 25 సూపర్ బిలియనీర్లు వీరే.. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఎలన్ మస్క్.. వీరిలో నెంబర్‌వన్ ఎవరంటే?

వినియోగదారుల కోసం టాటా కంపెనీ క్రోమా ఇప్పుడు మీ నగరంలో ఎయిర్ కండిషనర్లు (AC), కూలర్‌లను ఒకే రోజు డెలివరీ చేస్తుంది. గతంలో క్రోమా గాడ్జెట్‌లు, చిన్న అప్లియన్సెస్ త్వరిత డెలివరీ సర్వీసును ప్రారంభించింది. ఇప్పుడు ఈ సౌకర్యాన్ని విస్తరిస్తూ, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్‌లను కూడా వెంటనే అందుబాటులోకి తీసుకువస్తోంది. మీరు ఇకపై ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు.

ఆర్డర్ చేస్తే.. అదే రోజు డెలివరీ :
క్రోమా కస్టమర్లకు మెరుగైన షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. ఇప్పుడు మీరు సాయంత్రం 6 గంటలలోపు మీ సమీపంలోని క్రోమా స్టోర్, (Croma.com) లేదా Tata Neu యాప్ నుంచి ఏసీ లేదా కూలర్ ఆర్డర్ చేస్తే.. మీకు అదే రోజు డెలివరీ అవుతుంది. మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, తీవ్రమైన వేడిలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉండవచ్చు.

క్రోమా సీఈఓ శిబాషిష్ రాయ్ మాట్లాడుతూ.. ‘ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. క్రోమా తమ యూజర్లకు మరింత సౌకర్యాన్ని అందించే దిశగా అదే రోజు డెలివరీ సర్వీసును ప్రారంభిస్తోంది. ఈ సర్వీసును ఇప్పుడు 28 సిటీలు, అంతకంటే ఎక్కువ నగరాల్లో అందుబాటులో ఉంది. ఇన్‌స్టంట్ కూలింగ్ కోరుకునే వినియోగదారులు మీ సమీపంలోని క్రోమా స్టోర్‌ను సందర్శించండి లేదా (Croma.com, Tata Neu) యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయండి’ అని సూచించారు.

Read Also : Whatsapp UPI Lite : గుడ్ న్యూస్.. పిన్ అక్కర్లేదు.. వాట్సాప్‌లోనే బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే?

హైదరాబాద్ సహా పలు సిటీల్లో సర్వీసులు :
అహ్మదాబాద్, ఔరంగాబాద్, బరోడా, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, చికల్తానా, కోయంబత్తూర్, ఢిల్లీ, ఫరీదాబాద్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, నోయిడా, గురుగ్రామ్, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కళ్యాణ్-డోంబివాలి, కామోథే, లక్నో, మొహాలి, ముంబై, నాసిక్, నవీ ముంబై, పంచకుల, పూణే, రాజ్‌కోట్, రెడ్‌హిల్ (చెన్నై), సికింద్రాబాద్, సింహగడ్ (పుణే), సూరత్, తలేగావ్ (పింప్రి), థానే, వనస్థలిపురం, వండలూర్ వంటి నగరాల్లో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

క్రోమాలో చౌకైన ధరకే ఏసీలు :
క్రోమాలో ఎయిర్ కండిషనర్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ముఖ్యంగా వోల్టాస్, హిటాచీ వంటి కంపెనీల ఎయిర్ కండిషనర్లు సగం ధరకే అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఏసీలు లేదా కూలర్ కోసం చూస్తుంటే.. ఇప్పుడే క్రోమా ద్వారా ఆర్డర్ చేసుకోండి.