Super Billionaires : వరల్డ్ టాప్ 25 సూపర్ బిలియనీర్లు వీరే.. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఎలన్ మస్క్.. వీరిలో నెంబర్‌వన్ ఎవరంటే?

Super Billionaires : వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, జెఫ్ బెజోస్ ప్రపంచంలోని టాప్ 25 సూపర్ బిలియనీర్లలో చోటు దక్కించుకున్నారు. 24 సూపర్ బిలియనీర్లలో 16 మంది సెంటీ-బిలియనీర్లు, కనీసం 100 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగి ఉన్నారు.

Super Billionaires : వరల్డ్ టాప్ 25 సూపర్ బిలియనీర్లు వీరే.. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఎలన్ మస్క్.. వీరిలో నెంబర్‌వన్ ఎవరంటే?

Super Billionaires

Updated On : February 27, 2025 / 4:31 PM IST

Super Billionaires : వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) ప్రపంచంలోని టాప్ 24 సూపర్ బిలియనీర్ల (అల్ట్రా-రిచ్) జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్, వారెన్ బఫెట్ ఉన్నారు. డబ్ల్యూఎస్‌జే నివేదిక ప్రకారం.. అపర కుబేరుడు ఎలోన్ మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించాడు.

మస్క్ మొత్తం సంపద 419.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 34.7 లక్షల కోట్లు). ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఫలితంగా “సూపర్ బిలియనీర్” అనే కొత్త కేటగిరీ ఆవిర్భించింది. 50 బిలియన్లు (50 బిలియన్ డాలర్లు) లేదా అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తులను సూపర్ బిలియనీర్లుగా చెప్పవచ్చు.

Read Also : Sukanya Samriddhi Yojana : ఈ పథకంలో 15 ఏళ్లు పెట్టుబడి పెడితే చాలు.. మీ కూతురి పెళ్లినాటికి రూ. 69 లక్షలపైనే చేతికి అందుతాయి..!

సూపర్ బిలియనీర్ ఎవరు? :
వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) ప్రకారం.. నికర విలువ 50 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 4.1 లక్షల కోట్లు) దాటిన వ్యక్తులను సూపర్ బిలియనీర్లు అంటారు. ఈ జాబితాలోని 24 మందిలో 16 మంది “సెంటి-బిలియనీర్” కేటగిరీలోకి వస్తారు. అంటే.. వారి సంపద 100 బిలియన్ డాలర్లు (రూ. 8.3 లక్షల కోట్లు) కన్నా ఎక్కువ.

ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే? :
డబ్ల్యూఎస్‌జే (WSJ) నివేదికల ప్రకారం.. ఎలోన్ మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఆయన నికర విలువ 419.4 బిలియన్ డాలర్లు. మస్క్ టెస్లా, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్, ఎక్స్ వంటి కంపెనీలను కలిగి ఉన్నారు. మస్క్ సంపద సాధారణ అమెరికన్ కుటుంబం సగటు సంపద కన్నా 2 మిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది.

భారత్ నుంచి ఎవరెవరు ఉన్నారు? :
ఈ జాబితాలో భారత్ నుంచి ఇద్దరు అతిపెద్ద వ్యాపార దిగ్గజాలు ఉన్నారు. వారిలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ కూడా ఉన్నారు. ముఖేష్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్) సంపద 90.6 బిలియన్ డాలర్లు. కాగా, గౌతమ్ అదానీ (అదానీ గ్రూప్) సంపద 60.6 బిలియన్ డాలర్లు.

టెక్ పరిశ్రమలో అతిపెద్ద సూపర్ బిలియనీర్ :
టాప్ 10 ధనవంతులలో ఎక్కువ మంది టెక్ పరిశ్రమలో ఉన్నవారే ఉన్నారు.
ఎలోన్ మస్క్ : 419.4 బిలియన్ డాలర్లు
అమెజాన్ (జెఫ్ బెజోస్) : 200+ బిలియన్ డాలర్లు
బెర్నార్డ్ ఆర్నాల్ట్ : 190+ బిలియన్ డాలర్లు
లారెన్స్ ఎల్లిసన్ : 140+ బిలియన్ డాలర్లు
మెటా (మార్క్ జుకర్‌బర్గ్) : 120+ బిలియన్ డాలర్లు
సెర్గీ బ్రిన్ : 110+ బిలియన్ డాలర్లు
గూగుల్-ఆల్ఫాబెట్ (సెర్గీ బ్రిన్ అండ్ లారెన్స్ పేజీ) : 100.9 బిలియన్ డాలర్లు
మైక్రోసాఫ్ట్ (బిల్ గేట్స్ అండ్ స్టీవెన్ బాల్మెర్) : 106 బిలియన్ డాలర్లు
NVIDIA (జెన్సన్ హువాంగ్) : 108.4 బిలియన్ డాలర్లు

Read Also : iPhone 16e Sale : ఈ నెల 28 నుంచే ఆపిల్ ఐఫోన్ 16e సేల్.. ఈ కొత్త ఐఫోన్ కొనాలా? వద్దా..? ఛాయిస్ మీదే..!

మహిళా సూపర్ బిలియనీర్లు తక్కువ :
మహిళా సూపర్ బిలియనీర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ జాబితాలోని టాప్ 24 జాబితాలో కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఇందులో ఆలిస్ వాల్టన్ (వాల్మార్ట్), జూలియా కోచ్ (కోచ్ ఇండస్ట్రీస్), ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ (లోరియల్) ఉన్నారు. ఈ ముగ్గురు మహిళల సంపద కూడా 50 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ. కానీ, ఈ సంఖ్య ఇప్పటికీ మిగిలిన బిలియనీర్ల కన్నా చాలా తక్కువగానే ఉంది.