Whatsapp UPI Lite : గుడ్ న్యూస్.. పిన్ అక్కర్లేదు.. వాట్సాప్‌లోనే బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే?

Whatsapp UPI Lite : వాట్సాప్ యూజర్ల కోసం యూపీఐ లైట్‌ ఫీచర్ రాబోతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. దీని ద్వారా యూజర్లు సులభంగా పిన్ లేకుండానే బిల్ పేమెంట్లు చేసుకోవచ్చు.

Whatsapp UPI Lite : గుడ్ న్యూస్.. పిన్ అక్కర్లేదు.. వాట్సాప్‌లోనే బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే?

Whatsapp UPI Lite

Updated On : February 27, 2025 / 5:44 PM IST

Whatsapp UPI Lite : వాట్సాప్ యూజర్లకు పండగే.. అతి త్వరలో యూపీఐ లైట్ ఫీచర్ ఆప్షన్ వస్తోంది. ఈ కొత్త ఆప్షన్‌ ద్వారా యూజర్లు సులభంగా బిల్ పేమెంట్లు చేసుకోవచ్చు. రాబోయే ఈ కొత్త యూపీఐ లైట్ ఫీచర్.. గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే ఉంటుంది. వాట్సాప్ త్వరలో యూపీఐ లైట్ పేమెంట్ ఆప్షన్ ప్రవేశపెట్టవచ్చని కొత్త నివేదిక పేర్కొంది. పూర్తి వివరాలను ఓసారి పరిశీలించండి.

వాట్సాప్ యూపీఐ లైట్ పేమెంట్ :
వాట్సాప్ యూపీఐ లైట్ సమాచారం ఆండ్రాయిడ్ అథారిటీ నుంచి వచ్చింది. ప్రస్తుతానికి APK టియర్‌డౌన్‌లో కనిపించింది. వాట్సాప్ (v2.25.5.17) బీటా వెర్షన్‌లో యూపీఐ లైట్‌కి సంబంధించిన కోడ్ స్ట్రింగ్‌లు కనిపించాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ మోడ్‌లో ఉందని కొత్త అప్‌డేట్‌లు సూచిస్తున్నాయి. ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో ఉండగా స్టేబుల్ అప్‌డేట్ ద్వారా అందరి యూజర్లకు ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెల్లడించలేదు.

యూపీఐ లైట్ ఈ డివైజ్‌ల్లో పనిచేయదు :
సర్వర్లు బిజీగా ఉన్నప్పుడు కూడా వాట్సాప్ యూపీఐ లైట్ పేమెంట్లు అవుతాయి. ఫెయిల్ రేటు చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులు అతి త్వరలో పిన్ లేకుండానే పేమెంట్లు చేసే ఆప్షన్ పొందవచ్చు. యూపీఐ లైట్ ప్రైమరీ డివైజ్‌లో మాత్రమే పనిచేస్తుంది. అంటే.. వాట్సాప్ లింక్ చేసిన డివైజ్‌లలో అందుబాటులో ఉండదు.

ప్రస్తుతానికి సంబంధించి, వాట్సాప్‌లో యూపీఐ లైట్ ఆప్షన్ అందుబాటులో లేదు. Samsung Wallet, PhonePe, GPay వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగానే వాట్సాప్ కూడా అలానే ఉంటుంది. వాట్సాప్‌కు భారీ యూజర్ బేస్ ఉంది. అందుకే యూపీఐ లైట్ కూడా అందుబాటులోకి రానుంది.

యూపీఐ లైట్ అంటే ఏంటి? :
యూపీఐ లైట్ ద్వారా చిన్న లావాదేవీలు చేయొచ్చు. వినియోగదారులు కొంత మొత్తాన్ని ముందస్తుగా లోడ్ చేసి, ఆపై ఎలాంటి పిన్ అవసరం లేకుండా పేమెంట్లు చేయవచ్చు. ఇది చాలా సేఫ్ కూడా. ఇప్పుడు వాట్సాప్ సాయంతో వినియోగదారులు పేమెంట్లు చేయడం సులభం కానుంది.

వాట్సాప్ ఇప్పటికే యూజర్లకు పేమెంట్లు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీని సాయంతోనే యూపీఐ పేమెంట్లు కూడా చేయవచ్చు. మీరు యూపీఐ పేమెంట్ల కోసం ఉపయోగించవచ్చు. అలాగే మీ బిల్లు పేమెంట్ కూడా చేసుకోవచ్చు.