ఆ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోవద్దు : SBI

భారత్ లో పెరుగుతున్న COVID కేసుల మధ్య డిజిటల్ లావాదేవీలు పుంజుకోవడంతో, దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకు ఎస్బిఐ తన వినియోగదారులను సైబర్ నేరగాళ్ల నుండి

ఆ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోవద్దు : SBI

Sbi

Updated On : May 5, 2021 / 9:45 AM IST

digital banking frauds: భారత్ లో పెరుగుతున్న COVID కేసుల మధ్య డిజిటల్ లావాదేవీలు పుంజుకోవడంతో, దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకు ఎస్బిఐ తన వినియోగదారులను సైబర్ నేరగాళ్ల నుండి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.. గుర్తుతెలియని యాప్ లను డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరించింది. ఇ-మెయిల్స్, ఎస్ఎంఎస్ లేదా ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే ఆకర్షణీయమైన, అయాచిత ఆఫర్లకు స్పందించవద్దని వినియోగదారులను కోరింది.

పుట్టిన తేదీ, డెబిట్ కార్డ్ నంబర్, డెబిట్ కార్డ్ పిన్, సివివి, ఒటిపి వంటి ఆధారాలను పంచుకోవద్దని, ఎస్‌బిఐ, ఆర్‌బిఐ, పోలీసులు లేదా కెవైసి అథారిటీ నుండి కాల్ చేస్తున్నట్లు నటిస్తున్న మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించాలని వినియోగదారులకు సూచించింది. కస్టమర్లను మోసగాళ్ళ నుండి కాపాడటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ‘ఆర్‌బిఐ సేస్’ పేరుతో కస్టమర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో డిజిటల్ బ్యాంకింగ్ మోసాలు భారీగా వెలుగులోకి వచ్చాయి.. అయితే ఇప్పుడు కరోనావైరస్ సెకండ్ వేవ్ ను అరికట్టడానికి అనేక రాష్ట్రాలు విధించిన ఆంక్షల నేపథ్యంలో మోసగాళ్ళు మళ్లీ విరుచుకుపడే అవకాశం ఉందన్న ఆలోచనతో బ్యాంకులు తన కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి.