Dgca Extends Ban On Scheduled International Commercial Flights
international commercial flights : అంతర్జాతీయ వాణిజ్య విమానాలపై నిషేధాన్ని పొడిగించింది డీజీసీఏ (DGCA). వచ్చే నెల నవంబర్ 30 వరకు అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని పొడిగించినట్టు పౌరవిమానయాన డైరెక్టర్ జనరల్ (DGCA) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తామని డీజీసీఏ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
KTR France : పెట్టుబడులే లక్ష్యంగా..మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్ టూర్
— DGCA (@DGCAIndia) October 29, 2021
అది కూడా సంబంధిత అధారిటీ ఆమోదంతో అనుమతిస్తారని DGCA స్పష్టం చేసింది. ఈ మేరకు నోటీసు జారీ చేసింది. ప్రత్యేకించి డీజీసీఏ ఆమోదించిన అన్ని కార్గో విమాన సర్వీసులు, ఆమోదిత విమానాలపై ఆంక్షలు వర్తించవని తెలిపింది. అంతకుముందు సెప్టెంబర్‌లో అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని డీజీసీఏ అక్టోబర్ 31 వరకు పొడిగించింది.
Long Range Bomb : భారత్ మరో ఘనత..లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం విజయవంతం