×
Ad

EBay ‘Layoff : వందలాది ఉద్యోగుల్ని తొలగిస్తున్న EBay..

ప్రముఖ ఈకామర్స్ కంపెనీ (E commerce Company)ఈబే 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

  • Published On : February 8, 2023 / 01:33 PM IST

EBay ‘Layoff

‘Layoff’ అనే మాట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని బడా కంపెనీల్లోను సర్వసాధారణంగా మారిపోయింది. ఉద్యోగుల తొలగింపుకు దిగ్గజ సంస్థలు కూడా వెనుకాడటంలేదు. కానీ ఆర్థిక సమస్యలు. ‘Layoff’ అనే మాట వినిపిస్తే ఉద్యోగులు హడలిపోతున్నారు. ప్రశాతంగా నిద్రపోలేకపోతున్నారు. ఆఫీసుకు వెళితే ఏమాట వినాల్సి వస్తుందోనని ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే డెల్,పేపాల్,గూగుల్,అమెజాన్,జొమాటో, ఇంటెల్, జూమ్,మైక్రోసాఫ్ట్ ఇలా ఒక్కటేమిటి? దాదాపు అన్ని దిగ్గజ కంపెనీలు లేఆఫ్ బాటలోనే నడుస్తున్నాయి. వీరి బాటలోనే నేను కూడా అంటోంది ప్రముఖ ఈకామర్స్ కంపెనీ ఈబే (EBay)కూడా. ఉద్యోగుల్లో 4 శాతం మందిని తొలగిస్తోంది.

Zoom Layoffs: ఉద్యోగాలకు కోత పెడుతున్న జూమ్.. 1300 మందిని తొలగించేందుకు సిద్దం

ప్రముఖ ఈకామర్స్ కంపెనీ (E commerce Company)ఈబే  (EBay Layoff) 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఏదో విధంగా నెట్టుకొచ్చిన కంపెనీలు ఆ ప్రభావం తాజాగా పడటానికి తోడు ఆర్థిక సంక్షోభం వెరసి ఉద్యోగుల కోత విధిస్తున్నాయి పలు కంపెనీలు. కరోనా మహమ్మారి తర్వాత అమ్మకాలు తగ్గడంతో(Declining sales) 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని ఈబే(E commerce Company) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జామీ ఇయానోన్ (Chief Executive Officer Jamie Iannone)మంగళవారం (ఫిబ్రవరి 7,2023) ప్రకటించారు. 4 శాతం ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈబే కంపెనీ సీఈఓ జామీ ఇయానోస్ తెలిపారు.

Boeing Layoff : లేఆఫ్‌ల బాటలో విమానాల తయారీ సంస్థ బోయింగ్ .. వేలాదిమంది ఉద్యోగులు తొలగింపు

1995లో అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థాపించబడిన ఈబే ఈకామర్స్ అమ్మకాలు, కొనుగోలు ప్లాట్ ఫామ్ గా ఉంది. ఎలక్ట్రానిక్స్,ఫ్యాషన్ ప్రొడక్ట్స్ నుంచి గిఫ్టు ఆర్టికల్స్ తో పాటు అనేక రకాల ఉత్పత్తులు ఈబేలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి.

డెల్ కంపెనీ,జూమ్ కంపెనీ కూడా ఉద్యోగుల కోత విధించాయి. జూమ్ 1300ల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రటించింది. అలాగే డెల్ 6,600 ఉద్యోగాలను తగ్గించింది. అమ్మకాలు క్షీణించి ఆదాయం తగ్గడంతో ఉద్యోగుల తొలగింపు తప్పలేదని కంపెనీ వివరించింది. అలాగే ఈకామర్స్ కంపెనీ అమెజాన్ ఏకంగా 18వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా ఈ కంపెనీ ఈ కంపెనీ అనిలేదు ఉద్యోగుల కోత ప్రకటనల్ని మోతెక్కిస్తున్నాయి. ఆయా కంపెనీల ప్రకటనలతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.